New IAF Chief: భారత వాయుసేన కొత్త ఎయిర్ చీఫ్‌గా ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం అశుతోష్ దీక్షిత్ అధికారికంగా వాయుసేనాధిపతిగా పగ్గాలు అందుకోనున్నారు. ఆయన 2028 డిసెంబర్ 31 వరకు ఈ అత్యున్నత హోదాలో కొనసాగుతారు.
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం
1966 డిసెంబర్‌లో జన్మించిన అశుతోష్ దీక్షిత్, 1986 డిసెంబర్‌లో భారత వైమానిక దళంలో కమీషన్డ్ ఆఫీసర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. దాదాపు 40 ఏళ్ల తన సుదీర్ఘ సర్వీసులో ఎన్నో కీలక విభాగాలు, బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. కీలక ఆపరేషన్లలో లీడింగ్ రోల్.. 3,500 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన సొంతం. కార్గిల్ వార్ టైంలో చేపట్టిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’తో పాటు ‘ఆపరేషన్ రక్షక్’, ‘ఆపరేషన్ సిందూర్’ వంటి అత్యంత కీలకమైన మిషన్లలో అశుతోష్ దీక్షిత్ సేవలందించారు.
స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తేజస్‌తో పాటు మిరాజ్-2000, మిగ్ వేరియంట్లు, జాగ్వార్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లను నడపడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. యుద్ధ విమానాల్లో ఏకంగా 3,500 గంటలకు పైగా గాల్లో ప్రయాణించిన అరుదైన రికార్డు ఆయన సొంతం. చైనా, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వాయుసేన ఆధునీకరణ వేగవంతం కావాల్సిన ప్రస్తుత తరుణంలో అపార అనుభవం ఉన్న అశుతోష్ దీక్షిత్ ఐఏఎఫ్ సారథ్య బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


