సినిమా

Jailer 2: అల్లు అర్జున్ స్టామినా రజినీకాంత్‌కి లేదా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు మన టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ కావడం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి ఓ ముఖ్య కారణం.

Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2(Jailer2). ఈ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు మన టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ జైలర్ (Jailer) కి సీక్వెల్ కావడం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి ఓ ముఖ్య కారణం.

అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ నమోదు చేస్తుందీ అనే ఆసక్తి అటు తమిళ సినీ వర్గాలలో ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొంది. ముఖ్యంగా, మన టాలీవుడ్ ఐకాన్ స్టార అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప 2(Pushpa2), అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బాహుబలి 2(Bahubali2) చిత్రాలతో జైలర్ 2 ని పోల్చుకుంటున్నారు. దీనికి కారణం మన తెలుగు సినిమాలలో పుష్ప, బాహుబలి సీక్వెల్స్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్ ని రాబట్టాయి గనక.

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా 200 నుంచి 220 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే, బాక్సాఫీస్ కలెక్షన్స్ 650 కోట్ల లోపు వచ్చాయి. ఇక, పుష్ప సినిమా సీక్వెల్ 1800 కోట్ల వరకూ లాగింది. అలాగే, ప్రభాస్ నటించిన బాహుబలి 2.. 1800 కోట్లను దాటింది. ఈ రకంగా, టాలీవుడ్ లో హైయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా బాహుబలి 2, పుష్ప 2 నిలిచాయి. దాంతో, కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న రజినీకాంత్ జైలర్ సీక్వెల్ ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతుందీ అనేది ఇప్పుడు డిస్కర్షన్.

అంతేకాదు, రజినీ స్టామినా ముందు ఒకప్పుడు ఏ స్టార్ హీరో నిలవలేదు అని చెప్పుకునేవారు. ఎందుకంటే, ఆయనకి సౌత్ లో మాత్రమే కాకుండా జపాన్ వంటి దేశాలలోనూ అభిమానులు తయారయ్యారు. కానీ, ఇప్పుడు అంతకు మించిన క్రేజ్ అల్లు అర్జున్, ప్రభాస్‌లకి వచ్చింది. దాంతో, మన టాలీవుడ్ స్టార్స్‌తో రజినీకాంత్ సినిమా కలెక్షన్స్ ని కంపేర్ చేస్తున్నారు. కనీసం, జైలర్ 2 ఓ 1000 కోట్లైనా దాటుతుందా..! అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి, మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయికి వచ్చి చేరుకుంటాయో.

#Rajinikanth#Jailer 2#Nelson Dileep Kumar#Allu Arjun#Pushpa 2#Prabhas#Bahubali 2
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి