రాజకీయాలు

Telangana: రేవంత్‌కు సవాల్ విసిరిన కేటీఆర్.. ఆ కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్దమా!..

రచన: Venu4 నిమిషాల పఠనం

ఒకవైపు దేశ రాజకీయాలు, మరోవైపు రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు విమర్శలతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే నీట్ వ్యవహారం మంటపుట్టిస్తుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య నిప్పులో ఉప్పులా మాటలు చిటపటలాడుతున్నాయి..

ఒకవైపు దేశ రాజకీయాలు, మరోవైపు రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు విమర్శలతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే నీట్ వ్యవహారం మంటపుట్టిస్తుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కూడా పచ్చ గడ్డి వేస్తే భగ్గు మానేలా.. నిప్పులో ఉప్పులా మాటలు చిటపటలాడుతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ఘాటుగా విమర్శించుకోవడం కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలో వరంగల్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా సంస్థ తనదంటూ చేసిన ఆరోపణలపై సీఎం కు డిఫమేషన్ నోటీసులు పంపినట్లు తెలిపారు. వాటికి సరైన సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

ఈ అంశం పై తాను విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, దమ్ముంటే విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు ఇద్దరం వెళ్దామని, అందుకు సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు.. మరోవైపు బీజేపీని, ప్రధాని మోదీని ఏమన్న అంటే ఎక్కడ పాత కేసులు బయటికి తవ్వుతారో అనే భయంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నా బీజేపీ మౌనంగా ఉంటోందని మండిపడ్డారు.

ఇక రేవంత్ రెడ్డి పగలంతా కాంగ్రెస్ పాట పాడుతాడని, రాత్రి మాత్రం బీజేపీ మనిషిగా వ్యవహరిస్తాడని ఎద్దేవా చేశాడు.. తమది తెలంగాణ జాతి అని, బ్యాగులు మోసే జాతి లేదా దగుల్బాజీ జాతి కాదని కేటీఆర్ చురకలు అంటించాడు.. అలాగే అమృత్ కాంట్రాక్టుల్లో రేవంత్ రెడ్డి బావమరిది తీవ్ర కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించిన కేటీఆర్.. వచ్చిన లాభాల్లో కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని ఆరోపించారు.

ఇక ప్రభుత్వం గ్లోబరీనా, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి ఏ అంశంపైనా కేసులు పెట్టుకోవచ్చని, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ సవాల్ విసిరారు. అలాగే గ్లోబరీనా సంస్థ తనదేనని రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను దేనికైనా సిద్దమే అన్నారు.. రాబోయే రోజుల్లో తమ పాదయాత్ర జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని, త్వరలోనే అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేలా రాజకీయ ప్రణాళికతో ముందుకు సాగుతామని కేటీఆర్ వెల్లడించారు.

#Telangana#KTR#Revanth#lie detector#Globerina#Phone Tapping#Formula E-Race
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి