క్రీడలు

Ind Vs Zim: ఎట్టకేలకు తొలి విజయం అందుకున్న అయ్యర్.. జింబాబ్వేపై భారత్ విక్టరీ

రచన: NK3 నిమిషాల పఠనం

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. 126 రన్స్ టార్గెట్ ను భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. వైభవ్ సూర్యవన్షీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపరిచాడు.

Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. 126 రన్స్ టార్గెట్ ను భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. వైభవ్ సూర్యవన్షీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశపరిచాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో రాణించారు.

ఇక, టీమిండియా కెప్టెన్ గా శ్రేయర్ అయ్యర్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకున్నాడు. ముందుగా ఐర్లాండ్ తో ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో భారత్ టీ20 సిరీస్ కోల్పోయింది. టీ20 సిరీస్ లలో వరుస పరాజయాలు చవిచూసింది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. కెప్టెన్ గా అయ్యర్ కూడా విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ నెల 25న రెండో టీ20 జరగనుంది.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా సెన్సేషన్, బేబీ బాస్ వైభవ్ సూర్యవన్షీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధాటిగా బ్యాటింగ్ ఆడాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

#India#Zimbabwe#Ind Vs Zim#India Win#Harare#1st T20I#Vaibhav Suryavanshi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి