Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్న తెలంగాణ శాసనసభ భవనంలో మరమ్మతు, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వాటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగారు. పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వారికి పలు సూచనలు కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు.













