సినిమా

Bollywood: నా మనసు ముక్కలైంది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్!..

రచన: Venu4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారం.. రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. పేపర్ లీక్‌పై సమగ్ర దర్యాప్తు జరిపి.. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారం.. రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. పేపర్ లీక్‌పై సమగ్ర దర్యాప్తు జరిపి.. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

ఈ నిరసనలకు విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా ఈ అంశంపై స్పందించారు. తాజాగా స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా NEET విద్యార్థులకు మద్దతుగా భావోద్వేగ పోస్ట్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆలియా భట్.. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తన మనసు ముక్కలైందని.. అయితే తమ హక్కుల కోసం విద్యార్థులు చూపిస్తున్న ధైర్యం మాత్రం తనకు ఆశను కలిగిస్తోందని అన్నారు.

ప్రతి విద్యార్థి వెనుక ఒక కల ఉంటుందని.. ఆ కలను నమ్ముకున్న కుటుంబం ఉంటుందని.. ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయని ఆలియా పేర్కొన్నారు. యువతే దేశ భవిష్యత్తును నిర్మించబోతోందని.. వారి బాధలు వినాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం.. విద్యార్థుల చేతనే మార్పు రావాలని కోరుకుంటూ.. జై హింద్ అంటూ తన సందేశాన్ని ముగించారు.

మరోవైపు హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, ప్రకాశ్ రాజ్, షబానా అజ్మీ, స్వరా భాస్కర్ సహా పలువురు సినీ ప్రముఖులు కూడా విద్యార్థుల నిరసనలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే నటి అయేషా ఖాన్ నిరసనల్లో పాల్గొన్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

NEET పేపర్ లీక్ వివాదం విద్యార్థుల సమస్యగా మాత్రమే కాకుండా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. విద్యార్థులకు న్యాయం చేయాలని.. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలనే డిమాండ్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి..

#India#Bollywood#Alia Bhatt#NEET#Paper leak
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి