తెలంగాణ

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్–2026 అవార్డు!!

రచన: Venu••4 నిమిషాల పఠనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అరుదైన గౌరవం దక్కింది. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం అందించే "బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌–2026" అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అరుదైన గౌరవం దక్కింది. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం అందించే "బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌–2026" అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది.

రాష్ట్రంలోని రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రేవంత్‌రెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. ప్రజాస్వామిక విలువల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

ఆర్యదాన్‌ ముహమ్మద్‌ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో నేడు జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారక ఉపన్యాసం చేయనున్నారు.

ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో ఎంపీ బెన్నీ బెహనన్‌, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఏపీ అనిల్‌కుమార్‌, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్‌ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ఇక ఆర్యదాన్‌ ముహమ్మద్‌ విషయానికి వస్తే.. ఆయన కేరళ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషించిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, కేరళలోని వివిధ ప్రభుత్వాల్లో నాలుగు పర్యాయాలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

దూరదృష్టి కలిగిన నాయకుడిగా, సమర్థవంతమైన పాలకుడిగా, అద్భుతమైన పార్లమెంటేరియన్‌గా, కార్మిక వర్గం కోసం పోరాడిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాయితీ, లౌకిక విలువలు, ప్రజా సంక్షేమ పాలనకు ప్రతీకగా నిలిచిన ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకంగా అందిస్తున్న ఈ పురస్కారం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వరించింది. కేరళ వేదికగా సీఎం అందుకోనున్న ఈ గౌరవం తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది..

#Telangana#Best Public Servant-2026 Award#CM Revanth Reddy#Kerala#Congress leader#Late Aryadan Muhammed
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి