తెలంగాణ

Hot Summer: వానలు అయిపోయాయి.. ఇక భగభగలే.. తెలంగాణలో రేపటి నుంచి మండిపోనున్న ఎండలు

రచన: NK••5 నిమిషాల పఠనం

Hot Summer: తెలంగాణలో జోరు వానలు కురిశాయి. పలు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వానలతో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిన ప్రజలు వాతావరణం చల్లబడి కాస్త రిలీఫ్ పొందారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. అయితే, రాష్ట్రంలో వాతావరణం మారిపోనుంది. మళ్లీ ఎండలు మండిపోనున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఈ మేరకు తెలంగాణ వెదర్‌మ్యాన్ ఇచ్చిన సమాచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

రాష్ట్రంలో తీవ్ర వాయుగుండం ప్రభావం పూర్తిగా ముగిసిందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. ఈ సీజన్‌కు సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రధాన వర్షాలు దాదాపుగా ముగిసినట్లేనని స్పష్టం చేశారు. శనివారం (సెప్టెంబర్ 26) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు గణనీయంగా తగ్గిపోయి, పొడి వాతావరణంతో పాటు తీవ్రమైన ఉక్కపోత మొదలవుతుందని వెల్లడించారు. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మినహా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని అంచనా వేశారు.

''సెప్టెంబర్ 26 నుండి ఉక్కపోతతో కూడిన పరిస్థితులు ఉంటాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడి, పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలు తక్కువగా కురుస్తాయి. అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉంది. చాలా చోట్ల ప్రధానంగా పొడిగానే ఉంటుంది. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 2 వరకు తెలంగాణ అంతటా తీవ్రమైన వేడి ఉండే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్య అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత తూర్పు గాలుల ప్రభావం (ఈశాన్య రుతుపవనాలకు ముందు వచ్చే వర్షాలు) కారణంగా అక్టోబర్ 3-10 మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ఏడాదికి ప్రధాన రుతుపవన వర్షాల కాలం సెప్టెంబర్ 26తో ముగిసినట్లేనని భావించవచ్చు. ఆ ప్రాంతాల్లో ఇకపై సాధారణ పొడి వాతావరణమే ఎక్కువగా ఉంటుంది'' అని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలియజేశారు.

ఇక ఎండలు మండిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పిన వార్త ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, సూపర్ ఎల్ నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలు కురవక ఎండలు మండిపోతున్నాయి. వేసవిని తలపించే ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

#Hot Summer#Telangana#Rains#Telangana Weather Man#Monsoon#Elnino#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి