స్వేచ్ఛ న్యూస్ మొదలుపెట్టిన రచ్చతో 22ఏపై అసెంబ్లీలో చర్చ
కొనసాగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన ఏలేటిపై ముప్పేట దాడి
దాడిలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ఇచ్చిన కొంత సమయంలోనే వేసిన ప్రశ్నలను జీర్ణించుకోలేకపోయిన అధికార పక్షం
ప్రతిపక్షాలను బయటకు పంపి తాము ఏది చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ప్రభుత్వం
4గంటల వరకు సమయం తీసుకున్న పొంగులేటి 22ఏ పై ఊకదంపుడు ఉపన్యాసం
ధరణి తర్వాత జరుగుతున్న దందాలపై మాట్లాడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వని అధికార పక్షం
ఒక ఫినిక్స్.. ఒక వంశీరాం.. ఒక ఏఎస్ఆర్.. ఒక వాసవి.. ఇలా కార్పొరేట్ కంపెనీలకు భూముల ధారదత్తం
ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చేందుకు స్వేచ్ఛ న్యూస్ వార్తలు రాస్తూనే ఉంటుంది
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని విలువైన భూముల కబ్జాలపై పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధం
పైలట్ ప్రాజెక్ట్ ముసుగులో చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు
అన్నిటిపై ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం
మాక్ అసెంబ్లీ అంటూ లేనిపోని మాటలతో మరింత దిగజారేలా బీఆర్ఎస్ తీరు
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809,
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.
ధరణి పేరుతో బీఆర్ఎస్ హయాంలో భూములు దోచుకున్నారు. ఇప్పుడు భూ భారతి పేరుతో అదే దోపిడీ కొనసాగుతోంది. ఈ విషయాన్ని స్వేచ్ఛ న్యూస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. 22ఏ అంశంలో సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని మొదట వెలుగులోకి తెచ్చింది స్వేచ్ఛ న్యూస్. ఇష్టానుసారంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూమి 22ఏ లోకి వెళ్లడంపై ప్రశ్నిస్తూ కథనాలు రాసింది. ధరణి బిడ్డనే భూ భారతి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. నెల రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.
స్వేచ్ఛ న్యూస్ మొదలుపెట్టిన రచ్చతో 22ఏపై ఎట్టకేలకు అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇచ్చిన కొంత సమయంలోనే ఆయన వేసిన ప్రశ్నలను జీర్ణించుకోలేకపోయిన అధికార పక్షం, అక్రమాలపై ప్రశ్నించిన ఏలేటిపై ముప్పేట దాడి చేసింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలను బయటకు పంపి తాము ఏది చెబితే అదే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ప్రభుత్వం ఉంది. దాదాపు 4 గంటల వరకు సమయం తీసుకున్న మంత్రి పొంగులేటి 22ఏ పై ఊకదంపుడు ఉపన్యాయం ఇచ్చారు.
ధరణి తర్వాత జరుగుతున్న దందాలపై మాట్లాడేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా అంతా సక్రమమే అన్నట్టు కలరింగ్ ఇచ్చారు. అంతా సక్రమమే అయితే ఒక ఫినిక్స్.. ఒక వంశీరాం.. ఒక ఏఎస్ఆర్.. ఒక వాసవి.. ఇలా కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేసిన భూముల లెక్కలేంటి? వాటిపై మాట్లాడే దమ్ముందా? కానీ, ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చేందుకు స్వేచ్ఛ న్యూస్ వార్తలు రాస్తూనే ఉంటుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని విలువైన భూముల కబ్జాలపై పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉంది. పైలట్ ప్రాజెక్ట్ ముసుగులో మండలం, గ్రామాన్ని యూనిట్‌గా ప్రకటించి చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటిపై ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సరైన సమాధానం చెబుతుందా?












