మన వంటింట్లో రోజూ వాడే జీలకర్ర కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఒంటికి లభించే మేలు అంతా ఇంతా కాదని అంటారు.
జీలకర్ర నీరు జీర్ణ వ్యవస్థకు తిరుగులేని ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, వికారం, అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలు తగ్గుతాయి. మన జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి, ఆకలిని పెంచుతుంది. అలాగే కడుపులో ఏర్పడే అల్సర్లు, మలబద్ధకం, మొలల సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఇది అద్భుతమైన మార్గం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో జీలకర్ర నీరు ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేసి, వ్యర్థాలను, హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది. రోజూ ఉదయాన్నే జీరా వాటర్ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గించి, శరీరంలో రక్త సరఫరా సాఫీగా సాగేలా చూడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీలకర్రలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
చర్మంపై ముడతలు, పొడిబారే సమస్యలను తగ్గించి ముఖానికి కాంతిని ఇస్తాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణ జలుబు, దగ్గు సమస్యల నుంచి కూడా ఈ నీరు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..
ఇక ఈ జీరా వాటర్ తయారీ చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో రెండు మూడు స్పూన్ల జీలకర్ర వేసి బాగా మరిగించి, చల్లారాక వడకట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం అలవాటు చేసుకోండి. అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహాతోనే దీనిని పాటించడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












