Aadarsha Kutumbam: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నివేతా పేతురాజ్, నారా రోహిత్ కనిపించబోతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా, ‘ఆదర్శ కుటుంబం’ నుంచి టీజర్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని రేకిత్తించగా..ఇప్పుడు గురూజీ స్పెషల్‌గా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాడు.
అనిల్ రావిపూడి గత కొంతకాలంగా ప్రమోషన్స్‌లో ఒక స్టైల్ ని మేయిన్‌టైన్ చేస్తున్నాడు. సినిమాను జనాలలోకి తీసుకువెళుతూ విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నాడు. దీనికోసం ప్రారంభం నుంచే కొత్త స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు. ఇక, ఈవెంట్స్ విషయంలో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, టీమ్ ఇంటర్వ్యూస్ కూడా కొత్తగా ప్లాన్ చేస్తూ సినిమా హిట్‌కి కారణం అవుతున్నాడు.
ఇప్పుడు, మిగతా దర్శకులు కూడా సినిమా ప్రమోషన్స్‌లో కాస్త అటు ఇటుగా అనిల్ రావిపూడి స్టైల్‌నే ఫాలో అవుతున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్‌లోనూ ఇలాంటి సరికొత్త ప్లాన్ చేసున్నారట. ప్రధాన తారగాణంపై పలు ఆసక్తికరమైన ఇంటర్వ్యూస్ డిజైన్ చేస్తున్నారు. ఇలాగే, ‘ఆదర్శ కుటుంబం’ కాన్సెప్ట్‌ను జనాలలోకి తీసుకువెళ్ళేలా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
అంతేకాకుండా, ప్రత్యేకించి వెంకటేష్-శ్రీనిధి శెట్టి-త్రివిక్రమ్ కాంబోలో కొన్ని ఇంటర్వ్యూలు..గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఇరుముడి ఇలాంటి ఫ్యామిలీ చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కానీ, ఆ సినిమాకి త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ కి కథ, పాత్రల పరంగా చాలా తేడా ఉంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్, వెంకీ మార్క్ కామెడీ ఆధారంగా ‘ఆదర్శ కుటుంబం’ రూపొందుతోంది. మరి, ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.












