సినిమా

Suriya: నవంబర్ లో 'సీన్' చూపించబోతున్న సూర్య..

రచన: Anshu4 నిమిషాల పఠనం

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. జిత్తు మాధవన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ వెరైటీ టైటిల్ కూడా రివీల్ చేయడం విశేషం. 'సీన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్ నవంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు.

వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుసగా రెండు భారీ హిట్స్ అందుకున్నాడు సూర్య. ఇక, త్వరలో రాబోతున్న 'సీన్' సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కసితో ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, జగరం స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక, తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, మాస్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయని టీజర్‌లో హింట్ ఇచ్చాడు జిత్తు మాధవన్.

గతంలో హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం సిరీస్ ఎంతటి ఘన విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య నట విశ్వరూపం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మళ్ళీ, ఇప్పుడు మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక, ఈ సినిమాను దసరా సీజన్ తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. వాస్తవానికి, మన సౌత్ ఇండస్ట్రీలకి దసరా అనేది సినిమాలకి మంచి సీజన్.

కానీ, ఈసారి దసరా బరిలో భారీ చిత్రాలున్నాయి. దాంతో, సూర్య సోలోగా బాక్సాఫీస్ వద్ద దుమారం రేపడానికి నవంబర్ నెలను ఎంచుకున్నాడు. నవంబర్ 6న 'సీన్' మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. రెండు వరుస హిట్స్ తర్వాత దీపావళి కానుకగా నవంబర్ 6న సీన్ మూవీతో వస్తోన్న సూర్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా లేదా చూడాలి.

#suriya#suriya 47#jithu madhavan#nazriya nazeem
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి