సినిమా

Ranabaali Teaser: సింగనమల బొబ్బిలి 'రణబాలి' గా విజయ్ విశ్వరూపం

రచన: Anshu4 నిమిషాల పఠనం

Ranabaali Teaser: కొన్ని సినిమాల ప్రమోషనల్ కంటెట్ చూస్తేనే ఇదేదో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ నమోదు చేయడం ఖాయమని కళ్ళు మూసుకొని డిసైడైపోవచ్చు. అలా, ఇప్పుడు ఫుల్ క్లారిటీగా డిసైయ్యే సినిమా విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి. తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ రిలీజై..అమాంతం అంచనాలను పెంచేసింది. హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద సునామీ రాబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకి రాహుల్ సాంకృత్యన్ మంచి హిట్ ఇచ్చాడు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కథాంశానికి లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ని జత చేసి తెరకెక్కించిన టాక్సీవాలా అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, గత కొన్ని రోజుల నుంచి విజయ్-రాహుల్ కాంబోలో సినిమా అంటే టాక్సీవాలా కంటే కాస్త ఎక్కువగా ఊహించుకున్నారు.

కానీ, తాజాగా వచ్చిన టీజర్ చూశాక ఓ బాహుబలి సినిమా టీజర్ చూసిన భావన కలిగించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. బ్రిటీష్ కాలం నాటి పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.."సింగమల బొబ్బిలి రణబాలి" అనే పవర్ ఫుల్ యోధుడి పాత్రలో నటిస్తున్నాడు విజయ్. ఆయన భార్యగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇక, తాజా టీజర్‌లో ఉన్న హైలెట్ డైలాగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

"ఇది అన్నపూర్ణ దేశంరా.. అన్నానికి కరువేంది".. అనే డైలాగ్.."సింగనమల బొబ్బిలి రణబాలిరా నీయక్కా".. అని విజయ్ పరిచయం చేసుకునే డైలాగ్..పీక్స్‌లో ఉన్నాయి. 1876-1878 కాలంలో భారతదేశాన్ని ఓ కుదిపేసిన అత్యంత దారుణమైన కరువు, బ్రిటిష్ పాలన నేపథ్యంలో రణబాలి తెరకెక్కినట్లుగా తాజా టీజర్ తో అర్థమవుతోంది.

ఇక, ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు. వరుస హిట్స్ అందుకుంటున్న మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ పాతాకాలపై భారీ బడ్జెట్‌తో రణబాలి రూపొందుతోంది. ఇటీవల కాలంలో విజయ్ కి సరైన హిట్ లేదు. కానీ, ఆ గ్యాప్ ని ఒక్క రణబాలి తో ఫిల్ చేయబోతున్నాడని నమ్మొచ్చు.

#Ranabaali Teaser Review#Ranabaali#Vijay Devarakonda#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి