తెలంగాణ

Congress : కేసీఆర్‌కు చెడు జరగాలని కుటుంబసభ్యులే కోరుకుంటున్నారు : టీపీసీసీ చీఫ్

రచన: Kumar4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటోందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ మాజీ సీఎం కేసీఆర్ చెడును కోరుకోలేదని అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటోందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ సర్కారు ఎప్పుడూ మాజీ సీఎం కేసీఆర్ చెడును కోరుకోలేదని అని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నామని పేర్కొన్నారు.‘కేసీఆర్ గతంలో జారిపడినప్పుడు సీఎం రేవంత్ వెంటనే స్పందించి అర్ధరాత్రి గ్రీన్ ఛానల్ ద్వారా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారని గుర్తుచేశారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు స్వయంగా సీఎం రేవంత్ ఆయన దగ్గరకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. ‘సీఎం తర్వాత అత్యధిక సెక్యూరిటీ పొందుతున్న వ్యక్తి కేసీఆరే’అని వెల్లడించారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే, సిరిసిల్లలో సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ నేతలు పిండ ప్రదానం చేయడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. ఈ విషయం ఓ ప్రధాన పత్రికలో కూడా ప్రచురించారని వెల్లడించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల తీరును మీడియా మిత్రులు గమనించాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడుతున్నారని, నిజానికి కేసీఆర్ ఆరోగ్యం క్షీణించాలని, ఆయనకు చెడు జరగాలని సొంత కుటుంబీకులే కోరుకుంటున్నారని అన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా మాట్లాడిన వీడియోలు అందరి వద్ద ఉన్నాయని గుర్తుచేశారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ కేసీఆర్ చెడు కోరుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణానికి కారణమైన వారిని కూడా క్షమించిన ఉదారత కాంగ్రెస్ పార్టీదని చెప్పుకొచ్చారు. ఉద్యమ నేతగా కేసీఆర్‌పై అందరికీ గౌరవం ఉందని, ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని మేము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్ దళితులకు, బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు నిరంతరం కట్టుబడి ఉందని టీపీసీసీ చీఫ్ స్పష్టంచేశారు.

#Tpcc cheif mahesh kumar goud#congress#kcr#harish rao#KTR#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి