The Paradise: బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమా రిలీజవుతుంటే ఎక్కువగా సందడి చేసేది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆడియన్సే. అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చే పర్సెంటేజీ కాస్త తక్కువ అంతే. వీరిలోనే అన్నీ రకాల ఆడియన్స్(ఫ్యామిలీ, యూత్, ఏజ్డ్) ఉంటారు. రిపీటెడ్ ఆడియన్ ఉండాలంటే సినిమా బావుండాలి..టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ స్ట్రాటజీ ఫాలో అయింది కాబట్టే ఇరుముడి భారీ లాభాలను దక్కించుకుంది. ప్యారడైజ్ విషయంలోనూ అదే ప్లాన్ చేస్తున్నారట.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. మహానటి కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో కనిపించబోతుంది. ఇటీవల నాని-కీర్తిలపై తెరకెక్కించిన ఏషనాగుల ఫోక్ సాంగ్ కి యూట్యూబ్ షేక్ అయిన సంగతి తెలిసిందే. ఇక, ప్యారడైజ్ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇరుముడి పద్ధతినే ఫాలో అవుతున్న నాని:
రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ ఇరుముడి సినిమాకి ఎలాంటి టికెట్ హైక్ లేకుండా ప్రతీ ఒక్క ఆడియన్ హాయిగా థియేటర్ కి వెళ్ళి చూసేలా రిలీజ్ చేశారు. వారం తర్వాత రిలీజ్ చేసిన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీకి మాత్రం సంబంధం లేకపోయినా మన రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా టికెట్ ధరలను పెంచి మరీ రిలీజ్ చేశారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఫలితం గురించి పదే పదే మాట్లాడుకుంది..ఇంకా మాట్లాడుతుంది రవితేజ ఇరుముడి సినిమా గురించే.
టికెట్ ధరలు పెంచితే:
ఒకవేళ మీడియం బడ్జెట్ సినిమాకి కూడా టికెట్ ధరలు పెంచితే ఆడియన్స్‌లో ఆసక్తి సన్నగిల్లుతుంది. దాంతో, ఏ మూవీ రూల్జ్ లోనో చూద్దాంలే అని థియేటర్స్ కి వెళ్ళరు. అదే, ఇరుముడి సినిమా సక్సెస్ ముఖ్య కారణం అయింది. ఒకవేళ టికెట్ ధర గనక పెంచి ఉంటే ఖచ్చితంగా వసూళ్ళ మీద బాగానే ప్రభావం కనిపించేది. ఇక్కడే, మైత్రీ వారు చాలా తెలివిగా ప్రవర్తించారు. ఇప్పుడు, ఇదే స్ట్రాటజీని ప్యారడైజ్ టీమ్ కూడా అమలు చేయాలని భావిస్తుందట. ఎటువంటి టికెట్ హైక్ లేకుండా ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.












