తెలంగాణ

సినీ నటుడు తనిష్‌కు బెదిరింపు కాల్స్.. అక్రమాల చిట్టా విప్పుతానని హెచ్చరిక!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

జనసేన తెలంగాణ నాయకుడు, టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. ‘మంత్రి సీతక్క గురించి మాట్లాడేంత పెద్దవాడివా?" అని ప్రశ్నిస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించిన ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.

జనసేన తెలంగాణ నాయకుడు, టాలీవుడ్ నటుడు తనీష్‌కు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఈ విషయాన్ని ఆయన మీడియా వేదికగా వెల్లడించారు. ‘మంత్రి సీతక్క గురించి మాట్లాడేంత పెద్దవాడివా?" అని ప్రశ్నిస్తూ తనను అసభ్య పదజాలంతో దూషించిన ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. బాధితురాలైన ఒక ఆదివాసీ ఆడబిడ్డకు సరైన న్యాయం చేకూరాలనే ఏకైక ఉద్దేశంతోనే తాను మాట్లాడానని, జనసేన జెండా చేతబట్టిన రోజే ఇలాంటి రాజకీయ సవాళ్లకు సిద్ధపడ్డానని స్పష్టం చేశారు.

తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఈ తరహా మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని తనీష్ హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రత్యర్థులు కావాలని పర్సనల్ ఎటాక్‌గా మార్చే ప్రయత్నం చేస్తే, రాష్ట్రంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలు, వివిధ కాంట్రాక్టుల కమిషన్ల దందాల తాలూకు పూర్తి ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా వెనుక నుంచి బెదిరింపులకు పాల్పడటం పిరికిపంద చర్య అని ఆయన దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై నిలదీసే తమ గొంతును ఇలాంటి బెదిరింపులతో నొక్కలేరని తేల్చిచెప్పారు. రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజాసేవతో పాటు క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధపడటమేనని, బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తనీష్ పేర్కొన్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

#ActorTanish#JanasenaTelangana#Seethakka#SandMafia#TelanganaPolitics#TanishTollywood#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి