తెలంగాణ

Cm Revanth: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ ఘటనలపై విచారణకు ఆదేశం

రచన: NK5 నిమిషాల పఠనం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలపై ప్రత్యేక విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. ఐపీఎస్ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి.

Cm Revanth: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం ఘటనలపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఐపీఎస్ విజయ్ కుమార్ ను విచారణ అధికారిగా నియమించారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి.

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిని ఉప్పుపాతర వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు పన్నిన వ్యక్తులతో పాటు అమలు చేసిన వారిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 6న కేసీఆర్ ఫామ్ హౌస్ లో కుట్ర జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. 7న స్పీకర్ పై మాటల దాడి జరిగిందన్నారు. 8న శుద్ధి కార్యక్రమం చేపట్టారని తెలిపారు. శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు కుట్ర చేసిన అందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద శుద్ధి ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. గతంలో సిద్ధిపేట కమిషనర్ గా పని చేసిన, ప్రస్తుత హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ ను కేసు పర్యవేక్షణ అధికారిగా నియమించి విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. అనుకోకుండా జరిగిన ఘటనలను సరిదిద్దుకోవచ్చు.. కానీ కావాలని, కుట్రపూరితంగా, సమాజంలో చీలికలు తెచ్చేలా, దళితులు అనే భేదభావంతో సమాజాన్ని విభజించాలని చూస్తే మంచిది కాదని సీఎం రేవంత్ హితవు పలికారు.

అసెంబ్లీ జరిగితే బీఆర్ఎస్ దురాగతాలు బయటపడతాయని కేసీఆర్ కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు.. అధికారుల మీద దాడి చేయడమే కాకుండా సభాపతిని దూషించారని మండిపడ్డారు. సభాపతి తల్లిని అవమానించడం దారుణమన్నారు. కేసీఆర్ క్షమాపణ చెబుతారని అందరూ భావించారు.. కానీ ఆయన క్షమాపణ చెప్పకపోవడంతోనే కుట్ర జరిగిన ఫామ్ హౌస్ ముందు డప్పు కొట్టి నిరసన తెలిపారని రేవంత్ వివరించారు. ప్రజాస్వామిక పద్ధతిలో దండోరా వేశారు తప్ప దూషించలేదు, దాడులు చేయలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పా? అని సీఎం రేవంత్ నిలదీశారు.

దళిత సోదరులు నడిచిన నేల మలినమైందంటూ బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని.. కేసీఆర్, ఆయన కుటుంబం మనసులో పేరుకుపోయిన దొర అహంకారపూరిత అంటరానితనం ఆలోచనలను శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అంటరానితనాన్ని, వివక్షను, శుద్ధీకరణ కార్యక్రమాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. బాధ్యతతో వ్యవహరిస్తుందని రేవంత్ అన్నారు. దళిత సామాజికవర్గాలను, జాతులను అవమానించిన ప్రతి వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు.

#Cm Revanth#Telangana Assembly#Inquiry#Kcr#Brs#Telangana Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి