సినిమా

SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?

రచన: Anshu4 నిమిషాల పఠనం

SS.Thaman: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెకిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబందించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందున్న సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ తప్పుకొని, ఆ స్థానంలోకి థమన్ వచ్చి చేరాడు. ఇప్పుడు, థమన్ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడని తెలుస్తోంది.

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, మొదట్లో ప్రకటించిన సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ ఎందుకనో తప్పుకున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలిసింది మాత్రం..మూడు నెలల పాటు ఎలాంటి వర్క్ ఇవ్వలేదట.

అందుకే, త్రివిక్రమ్..హర్ష వర్ధన్ ని పక్కన పెట్టి..థమన్ ని తీసుకున్నాడు. త్రివిక్రమ్, థమన్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో అల వైకుంఠపురములో, అరవింద సమేత లాంటి భారీ హిట్స్ వచ్చాయి. అందుకే, థమన్ కి ఛాన్స్ ఇచ్చాడు గురూజి. కానీ, ఈ మధ్య ఈ సినిమా గురించి థమన్ ఎక్కడా మాట్లాడటం లేదు. మామూలుగా అయితే, సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా కొద్ది థమన్ నుంచే అప్‌డేట్స్ వస్తుంటాయి.

కానీ, ‘ఆదర్శ కుటుంబం’ కి సంబందించిన అప్‌డేట్స్ ఏవీ కూడా థమన్ ఇవ్వడం లేదు. పైపెచ్చు..ఈ సినిమా నుంచి థమన్ కూడా తప్పుకున్నాడని ప్రచారం మొదలైంది. వెంకీ-అనిల్ రావిపూడి సినిమాకి.. అలాగే, ఇటీవల సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి సంగీతం అందించిన జీవి ప్రకాష్ కుమార్ వచ్చి జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మరి, ఈ కన్‌ఫ్యూజన్ ఏంటో తెలియడం లేదు. కాగా, సురేష్ బాబు, సాహు గారపాటి కలిసి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని నిరిస్తున్నారు.

#aadarsa kutumbam#venkatesh#trivikram#srinidhi setty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి