సినిమా

Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Epic 2: మన ఇండస్ట్రీలో ఒకప్పుడు సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడవని టాక్ ఉండేది. కానీ, బాహుబలి2, పుష్ప 2 అది తప్పని ప్రూవ్ చేశాయి. బాహుబలి 1 కంటే 2 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే, పుష్ప ఫ్రాంఛైజీస్‌లో పార్ట్ 1 కంటే 2 ఊహించని వసూళ్ళు రాబట్టింది. కేజీఎఫ్ 2, కాంతార ఛాప్టర్ 1 కూడా అంతే. అయితే, ఇవన్నీ పాన్ ఇండియా స్కేల్ లో తీసిన సినిమాలు. కాబట్టి, వర్కౌట్ అయ్యాయి.

ఇక, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎపిక్. 90స్ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ ఫ్యూచర్ ఫిల్మ్ మొదటి రోజు డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. దర్శకుడు ఆదిత్య హాసన్ అసలు ఏం తీయాలనుకున్నాడు..ఏం చెప్పాలనుకున్నాడు..అనే విషయాలపై స్పష్టత కరువైందని సినిమా చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు. బేబీ సినిమాతో భారీ హిట్ అందుకున్న క్రేజీ కపుల్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించారు.

కాలేజ్ బ్యాక్ డ్రాప్..లండన్ లొకేషన్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచినప్పటికీ, కథలో బలమైన అంశాలేవీ లేక సో సో అనే టాక్ వచ్చింది. అయితే, మేకర్స్ మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించాడు నిర్మాతలలో ఒకరైన నాగ వంశీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

తాజాగా, నాగవంశీ ఈ సినిమాను సీక్వెల్ ఉందని చెప్పడంతో..ఫ్లాప్ సినిమాకి మళ్ళీ సీక్వెలా అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. డీజే టిల్లు బంపర్ హిట్ అవడంతో టిల్లు స్క్వేర్ తీసి హిట్ కొట్టారు. కానీ, ఇక్కడ ఎపిక్ కి వచ్చింది డివైడ్ టాక్. మరి, ఇప్పుడు సీక్వెల్ అని ఎలా ప్రకటించారో..ఆ కథ ఎలా ఉంటుందో..అని మాట్లాడుకుంటున్నారు. నాగవంశీ మాత్రం ఎపిక్ లో చూపించిన అంశాలను కొనసాగిస్తామంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది వర్కౌట్ అయ్యేనా!

#Nagavamshi#epic#epic 2#anand devarakonda#vaishanavi chaithanya
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి