యూరప్ దేశాలపై ఎలాంటి దాడులు చోయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు. తమ దేశం నుంచి ఆ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. గతంలోనూ రష్యా నుంచి ముప్పు వాటిల్లలేదని తేల్చిచెప్పారు.తాము యూరప్ దేశాలను బెదిరించడం లేదని, మున్ముందు కూడా బెదిరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. ఘర్షణ పడటానికి కూడా తమకు ఎలాంటి బలమైన కారణాలు లేవని, ఆ నిజాన్ని ఎవరూ గుర్తించడం లేదని వెల్లడించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన పుతిన్.. ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించారు. అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.
సోవియట్ యూనియన్ పతనంతో..
సెకండ్ వరల్డ్ వార్ ఫలితంగానే అన్ని సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యాయని, సోవియట్ యూనియన్ పతనం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రష్యన్ ఫెడరేషన్ అంగీకారంతోనే జరిగాయని గుర్తుచేశారు. ఆ అగ్రిమెంట్స్‌కు విరుద్ధంగా జరిగే చర్యలే రష్యా ప్రయోజనాలకు గండి కొడుతున్నాయన్నారు. అవి ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాల మౌలిక సూత్రాలకు పూర్తిగా వ్యతిరేకమన్నారు. మరోవైపు జర్మనీలోని సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర ఎన్నికల్లో ‘ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ పార్టీ అగ్రస్థానంలోకి రావడంపైనా పుతిన్ స్పందించారు.
ప్రస్తుతం యూరప్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయాలు, భద్రత, ఆర్థిక రంగాల్లో మిడిల్ ఈస్ట్ దేశాల గ్లోబలిస్టులు చేసిన వ్యవస్థాగత తప్పిదాల పర్యవసానాలే అని అభిప్రాయపడ్డారు.ప్రపంచంలో ఎవరైనా తప్పులు చేయడం సహజమని, తాము కూడా కొన్ని పొరపాట్లు చేశామని వెల్లడించారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత, తాము ఒలింపస్ శిఖరాగ్రాన ఉన్నామని తెలిపారు. తమకు సర్వహక్కులు ఉన్నాయని, తాము ఎప్పటికీ తప్పులు చేయబోమనే భ్రమలో పాశ్చాత్య పాలకులు విర్రవీగడమే నేటి సమస్యలన్నింటికీ ప్రధాన మూలకారణమని పుతిన్ ఘాటు విమర్శలు చేశారు.










