Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నాడంటే, ఆ సినిమా మ్యూజికల్‌గా డెఫినెట్‌గా హిట్టే. బీజీఎం కూడా కథకి తగ్గట్టుగా అందిస్తాడు. ఈ విషయంలో ఎక్కువగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను అనుసరిస్తాడు. అయితే, తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ సినిమాకి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడని అంటున్నారు.
ఆర్సీ 17..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి చేయబోతున్న భారీ చిత్రం. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా, ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.
దేవిశ్రీప్రసాద్‌కి మైత్రీ వారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రంగస్థలం, పుష్ప ఫ్రాంఛైజీస్ లాంటి బ్లాక్ బస్టర్స్‌కి మన రాక్ స్టారే మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాదు, శ్రీమంతుడు..జనతా గ్యారేజ్..లాంటి సినిమాలు మైత్రీ-డీఎస్పీ కాంబోలో వచ్చినవే. ఇంత లాంగ్ జర్నీ ఉన్న వీరి మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే, ముఖ్యంగా సుకుమార్..దేవిశ్రీప్రసాద్‌ల మధ్య అని చెప్పాలి.
సుకుమార్, చరణ్ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవీకే ఛాన్స్ రావాలి. కానీ, ఈ సినిమాకి మిస్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి, రాక్ స్టార్ కావాలనే ఈ ప్రాజెక్ట్ వదులుకున్నాడా..లేక సుకుమార్..మైత్రీ వాళ్ళు వద్దనుకుంటున్నారా..అసలు ఇది నిజమా కాదా..అనేది తెలియాల్సి ఉంది. అయితే, దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కూడా దేవీనే. అలాగే, నాగార్జున నటిస్తున్న కింగ్ 100కి కూడా డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా, బిజీగా ఉన్నాడు కాబట్టి..ఆర్సీ 17 కి నో చెప్పడా? అనేది తెలియాల్సి ఉంది.












