సినిమా

Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు

రచన: Anshu4 నిమిషాల పఠనం

Sai Durgha Tej: మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ కి ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మెగా హీరో నటించిన సినిమాలన్నీ చాలా క్లీన్ మూవీస్ గా వచ్చి హిట్ అందుకున్నాయి. విరూపాక్ష తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది.

ఇప్పటికే, సంబరాల ఏటి గట్టు పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీనికి, కారణం కొంత వరకూ ఫైనాన్స్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఏదైతేనేం మొత్తానికి ఇటీవల ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజాగా ఈ విషయంలో మరోసారి కూడా క్లారిటీ ఇచ్చాడు హీరో సాయి దుర్గ తేజ్. తాజాగా సంబరాల ఏటి గట్టు కి సాయి డబ్బింగ్ వర్క్‌ను స్టార్ట్ చేశాడు. దీనికి సంబందించిన వీడియోను ఎక్స్ ద్వారా పంచుకున్నాడు.

ఇక, ఈ సినిమాను దర్శకుడు రోహిత్ కెపి తెరకెక్కిస్తున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఇందులో సాయి దుర్గ తేజ్ మేకోవర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఇందులో, హీరోయిన్‌గా ఐశ్వర్య లేక్ష్మి నటిస్తోంది. షూటింగ్ మొత్తం పూర్తవగా..ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను షేర్ చేశాడు సాయి. ఇందులో, మరోసారి సినిమాను జనవరి 12, 2027న రిలీజ్ చేయనున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశారు.

ఇక ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. హను మాన్ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి భారీ చిత్రాలు రాబోతున్నాయి. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న జనవరి 12 విడుదల అదే తేదీకి విడుదలవుతోంది. ఆ సినిమాతో మన సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు పోటీకి దిగుతోంది. అలాగే, చిరంజీవి నటిస్తున్న కాకా..శ్రియా రెడ్డి నటిస్తున్న మహాకాళి, శర్వానంద్ నటిస్తున్న్ జార్జ్ క్రిష్ రిలీజ్ కాబోతున్నాయి. మరి, ఇంత పోటీ మధ్య సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటి గట్టు తట్టుకొని నిలబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

#Sai Durga Tej#Sambarala Yeti Gattu#Rohith KP#Aishwarya Lekshmi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి