తెలంగాణ

తెలంగాణపై అల్పపీడన ప్రభావం.. నేడు, రేపు 12 జిల్లాల్లో భారీ వర్షాలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 (శని, ఆదివారాలు) తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

 బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 (శని, ఆదివారాలు) తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.

 ప్రస్తుతం దక్షిణ ఒడిశా తీరం, వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిధిలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ విదర్భ వైపు పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతుందని అధికారుల అంచనా. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.

 ఈ ప్రాంతాల్లో 50 నుండి 70 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్‌ విషయానికొస్తే, నగరంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23-24 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదు కావచ్చని అంచనా వేశారు. ఇక గద్వాల, వనపర్తి, నారాయణపేట వంటి దక్షిణ జిల్లాల్లో వర్ష తీవ్రత స్వల్పంగా ఉండనుంది.

 ఈ వర్షాలు సాగు నీటికి ఎదురుచూస్తున్న అన్నదాతలకు పెద్ద ఊరట నిచ్చినప్పటికీ, అల్పపీడన తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడవద్దని సూచించారు. వర్షాల వల్ల నిలిచిపోయే నీటితో పంటలు దెబ్బతినకుండా రైతులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

#TelanganaRains#HyderabadWeather#IMDAlert#HeavyRains#LowPressure#TelanganaNews#RainForecast#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి