International

18వ బ్రిక్స్ సదస్సు.. ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాక!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం భారత్‌కు చేరుకున్నారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన దౌత్య సదస్సు తర్వాత, దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం షీ జిన్‌పింగ్ భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ (BRICS) అధినేతల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం భారత్‌కు చేరుకున్నారు. 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన దౌత్య సదస్సు తర్వాత, దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం షీ జిన్‌పింగ్ భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన పర్యటన కోసం భారత్ ప్రత్యేక దౌత్య, భద్రతా ఏర్పాట్లు చేసింది.

 ఈ ప్రతిష్టాత్మక పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు దాదాపు 400మంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, వాణిజ్య దిగ్గజాలతో కూడిన భారీ ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చింది. 2019 పర్యటనతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో ప్రతినిధులు రావడం ఈ పర్యటన ప్రాధాన్యతను చాటుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి చైనా పెద్దపీట వేస్తోంది.

 2020 గాల్వాన్ లోయ సరిహద్దు ఉద్రిక్తతల తదనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, గత కొంతకాలంగా సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణ, పెట్రోలింగ్ ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్న తరుణంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గాల్వాన్ ఘటన తర్వాత దైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఇరు దేశాలు శ్రమిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్ రాక దౌత్యపరంగా ఎంతో ప్రాముఖ్యమైనది.

 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో వాస్తవ అధీన రేఖ (LAC) వద్ద శాంతి భద్రతలు, సరిహద్దు నిర్వహణ, ఆర్థిక-వాణిజ్య సంబంధాల మెరుగుదల, ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. ఈ భేటీ ఆసియా ఖండంలో భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి సరికొత్త దిశను నిర్దేశిస్తుందని అంతర్జాతీయ దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

#XiJinping#BRICSSummit2026#PMModi#India#ChinaTies#NewDelhi#GlobalDiplomacy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి