తెలంగాణ

TG : రోడ్డెక్కిన రైతాంగం.. 24 గంటల కరెంట్ ఎక్కడ?

రచన: Kumar4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు.

తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు. ఈసారి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే .. వ్యవసాయబావుల ద్వారా మోటార్ల సాయంతో కొన్ని చోట్ల పంటలకు రైతులు నీళ్లు అందిస్తున్నారు.

అయితే, తాజాగా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని, హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటి అమలు ఏమైందని అన్నదాతలు మండిపడుతున్నారు. వెంటనే విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ రావడం లేదని సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు.

కరెంటు కోసం రైతులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను సకాలంలో ఇవ్వాలని రైతులు ఈ సందర్బంగా డిమాండ్ చేస్తున్నారు. ఎర్కారం సబ్‌స్టేషన్ ఎదుట జనగాం రహదారిపై రైతులు బైఠాయించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

https://x.com/pulsenewsbreak/status/2098662182414405913?s=20

ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరికలు పంపారు.ఇదిలాఉండగా రైతులకు సాగు నీరు, యూరియా, రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

#farmers protest#suryapet#power isses#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి