పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలకు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయని, మా పరిస్థితి ఏంటని పురుష ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు.కాగా, స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ(ఆధార్ కార్డు) వర్తింపజేయకపోవడంతో వారు సైతం ఫైర్ అవుతున్నారు. మహిళలు, పురుషులకు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని, మరి సీటింగ్ ఫెసిలిటీ ఏమైనా లగ్జరీ బస్సుల వలే ఉందా? అంటే అదే ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు కేవలం‘స్పెషల్’ అని స్టిక్కర్ అంటిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

ప్రస్తుతం వరుస సెలవులు రావడంతో ఉద్యోగులు, విద్యార్థులు సొంతూర్లకు వెళ్తున్నారు. దీనిని తెలంగాణ ఆర్టీసీ క్యాష్ చేసుకుంటున్నట్టు సమాచారం. సోమవారం వినాయకచవితి కావడంతో నిన్నసాయంత్రం నుంచే బస్టాండుల్లో రష్ పెరిగింది. దీంతో రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. అయితే, అందులో డబుల్ చార్జీలు వసూలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా హైదరాబాద్–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీని భారీగా పెంచినట్టు సమాచారం. ఆగస్టులో రూ.410గా ఉన్న టికెట్ ధర..సెప్టెంబర్‌లో ఏకంగా రూ.570 చేసినట్టు తెలుస్తోంది.ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఛార్జీలు పెంచారంటూ ప్రయాణికలు ఆరోపిస్తున్నారు. పండుగల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి టికెట్ ధరలు ఎందుకు పెంచుతున్నారంటూ పురుష ప్యాసింజర్స్ ప్రశ్నిస్తున్నారు. వాళ్లకు ఫ్రీ ఇచ్చి తమపై చార్జీలు బాదడం సరికాదని.. వాళ్లకు ఉచిత జర్నీ అంటూ.. మగాళ్ల నుంచి దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు ఇవ్వాలని మహిళలు ఏమైనా డిమాండ్ చేశారా? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు చార్జీలు పెంచుతున్నారని ప్రయాణికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మొన్న రాఖీ పండుగకు చార్జీలు పెంచారని, ఇప్పుడు తాజాగా మరోసారి పెంచారని ప్యాసింజర్స్ వాపోతున్నారు.
https://x.com/pulsenewsbreak/status/2098638351423447164?s=20










