సినిమా

SS.Rajamouli: వారణాసి చిత్రానికి వాళ్ళిద్దరే హైలెట్..

రచన: Anshu4 నిమిషాల పఠనం

SS.Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతటి భారీ విజువల్ వండర్స్‌ను తీస్తున్నప్పటికీ కథలో ఎక్కడా కూడా హ్యూమన్ ఎమోషన్స్‌ని మిస్ చేయడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు ఉదాహరణ. భారీ వీఎఫెక్స్, గ్రాఫిక్స్ ఉన్నా కూడా ఈ రెండు సినిమాలలో బంధాల గురించి కూడా అద్భుతంగా చూపించాడు. సంఘర్షణలు కూడా పాత్రల మధ్య కన్నీళ్ళు తెప్పిస్తాయి. అలాంటి, బలమైన ఎమోషన్స్ వారణాసి మూవీలో కూడా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది వారణాసి. ఈ సినిమాను ఓ అడ్వంచరస్ మూవీగా రూపొందిస్తున్నారని ఇన్నాళ్ళు అంతా అనుకున్నారు. అలాగే, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకూ సాగే టైమ్ ట్రావెల్ కథాంశం అని ఇటీవల కన్‌ఫర్మ్ అయింది.

అయితే, ఈ అంశాలతో పాటు తండ్రీకొడుకుల మధ్య ఉండే బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళతాయని..ఆ సన్నివేశాలే జనాలతో కన్నీళ్ళు పెట్టిస్తాయని దర్శకుడు రాజమౌళి హింట్ ఇచ్చాడు. పాత్రల మధ్య బలమైన ఎమోషనల్ సీన్స్‌ని రాజమౌళి ఏ విధంగా చూపిస్తాడో గత చిత్రాల్లో చూశాము. వారణాసిలో ఈ సీన్స్ ఇంకా హైలెట్‌గా నిలుస్తాయట.

ఇక, ఈ పాత్రల్లో మహేష్ బాబు-ప్రకాష్ రాజ్ నటించారని..వారిద్దరి నటన సినిమాకి మేయిన్ సోల్ అని చెప్పారు. దీన్ని, బట్టి వారణాసి మూవీలో బాగా హైలెట్ అయ్యే పాత్రలు మహేష్ అండ్ ప్రకాష్ రాజ్‌లని అర్థం అవుతోంది. అలాగే, మహేష్ శ్రీరాముడిగా కనిపించే ఎపీసోడ్ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకోనుందట.

కాగా, ఈ సినిమాను 120 దేశాలలో రిలీజ్ చేయబోతున్నారు. 50 భాషలలో చూడబోతున్నాము. 2027, ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ మనముందుకు రాబోతోంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేశారు. ఓ పక్క రాజమౌళి ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలను చూస్తున్నాడు.

#SS.Rajamouli#Varanasi#Super Star Mahesh Babu#Priyanka Chopra#PrakashRaj#PrthviRaj Sukumaran
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి