ఏపీ

AP: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీ మ్యూజియం ప్రారంభానికి ముహూర్తం ఖరారు!..

రచన: Venu4 నిమిషాల పఠనం

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మ్యూజియం పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, మ్యూజియంలోని అన్ని విభాగాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

మ్యూజియానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు, అవసరమైన సౌకర్యాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. మ్యూజియం నిర్వహణకు సంబంధించి టీసీఎస్ బృందానికి కూడా అవసరమైన సూచనలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈవో సూచించారు.

మరోవైపు.. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, కాలిబాట మార్గాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా గరుడసేవ రోజున కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఆ సమయంలో మొబైల్ సిగ్నల్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెల్ టవర్ల పనితీరును సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి అధికారులు సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా కమ్యూనికేషన్ సేవలు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.

ఇక భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆధునిక సౌకర్యాలు అందించేలా తిరుమల, తిరుపతి ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు..

#Andhra Pradesh#Tirumala#devotees#inauguration#SV Museum#Good news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి