Sharwanand: శ్రీను వైట్ల..ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. ఆనందం, ఢీ, రెడీ, దూకుడు, అందరివాడు, కింగ్, నమో వేంకటేశాయ లాంటి సినిమాలన్నీ అలా కళ్ళ ముందు మెదులుతాయి. అంతేకాదు, ఈ సినిమాలలోని కామెడీ సీన్స్..కామెడీ రోల్స్ అన్నీ గుర్తొస్తాయి. మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్స్‌తోనూ విపరీతమైన కామెడీ చేయించాడు.
అయితే, శ్రీను వైట్ల తీసిన ఆగడు సినిమా డిజాస్టర్ తర్వాత మళ్ళీ చాలా ఏళ్ళు కనిపించలేదు. ఈ సినిమాతో నిర్మాతలు చాలా నష్టాలను చూశారు. ఫాంలో ఉన్న మహేష్ కి కూడా ఆగడు సినిమా గట్టి షాకిచ్చింది. అప్పటి నుంచి శ్రీను వైట్ల సినిమా కోసం విశ్వ ప్రయత్నాలు చేసి అలిసిపోయి రెస్ట్ తీసుకున్నాడు. రెడీ లాంటి హిట్ ఇచ్చిన రామ్ పోతినేని, ఢీ లాంటి హిట్ అందుకున్న విష్ణు కూడా ఒక దశలో శ్రీను వైట్లకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాయి.
ఇక, ఎట్టకేలకి ఇప్పుడు టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈరోజే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ అధికారికంగా మొదలైంది. జార్జ్ క్రిష్ అనే టైటిల్‌తో శర్వానంద్ - శ్రీను వైట్ల మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. అయితే, ఇంత గ్యాప్ తర్వాత కూడా శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ కాన్సెప్ట్‌తోనే రాబోతుండటం ఆసక్తికరం.
ఈ మధ్యకాలంలో శర్వా చేసినవన్నీ కాస్త సీరియస్ రోల్సే. కానీ, ఈ టాలెంటెడ్ హీరోలోనూ మంచి కామెడీ టైమింగ్ ఉంది. కాబట్టి, ఈ కాంబోలో సినిమా గనక పడితే హిట్ గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. అన్నట్టుగానే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మరి, ఈ సినిమాతోనైనా మళ్ళీ శ్రీను వైట్ల సక్సెస్ ట్రాక్ ఎక్కి శర్వానూ అదే ట్రాక్ ఎక్కిస్తాడా లేదా చూడాలి. కాగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. 2027, సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


