హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టాలు తీసుకోబోమని ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవడంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘నాకు విద్యార్థులకు మధ్య జరిగే సంభాషణలో మీ జోక్యం ఏంటి?’ అంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)పై CJI సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఇచ్చిన ఆదేశాలపై మండిపడినట్టు తెలుస్తోంది. తాను కూడా విద్యార్థి దశలో చేపట్టిన నిరసనల్లో పాల్గొనేవాడినని, శాంతియుతంగా గళాన్ని వినిపిస్తే అనుమతించాలని వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా, దేశ యువతను ‘కాక్రోచెస్’ అని సంభోదించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా NALSAR న్యాయ కళాశాల విద్యార్థుల నమోదను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
మళ్లీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు BCI డైరెక్టర్ మనన్ కుమార్ మిశ్రా ప్రకటించారు.ఈ విషయంలోనే నల్సార్ యూనివర్సిటీ జోక్యం చేసుకోవడంపై చీఫ్ జస్టిస్ సీరియస్ అయ్యారు.


