Vijay Sethupathi: ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తమిళ విలక్షణ నటిడు విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. అయితే, ఇన్నాళ్ళు ఈ సినిమా రిలీజ్ కి పూరి జగన్నాధ్ కి మార్కెట్ లేకపోవడం వల్లే అనుకున్నారు. కానీ, విజయ్ సేతుపతి నటించిన రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ‘స్లమ్ డాగ్’ విడుదల ఆపుతున్నట్టుగా సమాచారం.
గత కొంతకాలంగా తెలుగులో పూరి జగన్నాధ్ మార్కెట్ ఏమంత బాగోలేదు. ఆయన బ్రాండ్ మీదే గనక ‘స్లమ్ డాగ్’ రిలీజ్ చేస్తే బిజినెస్ కావడం చాలా కష్టం అని ఇప్పటికే పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. పాత బకాయిల వల్ల ఇన్నాళ్ళు ‘స్లమ్ డాగ్’ రిలీజ్ విషయంలో మేకర్స్ ఇబ్బందులను ఎదుర్కున్నారు. ఫస్ట్ కాపీ ఎప్పుడో రెడీ అయినా కూడా ఒక్క విజయ్ సేతుపతి బ్రాండ్ మీదే బిజినెస్ అవ్వాలన్నా, రిలీజ్ కావాలన్నా.
కానీ, ఇప్పుడు ‘స్లమ్ డాగ్’ రిలీజ్ కాకపోవడానికి విజయ్ సేతుపతి కారణం అంటున్నారు. ఆయన హీరోగా నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కి రెడీ అయ్యాయి. మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ అనే సినిమాను చేశాడు సేతుపతి. వాస్తవానికి ఆగస్టులో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ, కొన్ని పనులు పూర్తి కాక సెప్టెంబర్ లో కొత్త డేట్ ని లాక్ చేసుకున్నారు.
ఇక, బత్తా అనే మరో సినిమా కూడా రెడీ అయింది. అక్టోబర్ నెలలో రిలీజ్ కన్‌ఫర్మ్ అయింది. దీంతో, పూరి-సేతుపతిల ‘స్లమ్ డాగ్’ కి లైన్ దొరకడం లేదు. దీన్ని, బట్టి చూస్తే ‘స్లమ్ డాగ్’ కి బెర్త్ కన్‌ఫర్మ్ కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ వరకూ ఆగాలి. నవంబర్ లో రిలీజ్ చేసినా రీచ్ ప్రాబ్లమ్ రావచ్చు. అదే, డిసెంబర్ నెలలో ఉన్న క్రిస్మస్ సెలవులను లాక్ చేయాలనుకుంటే అప్పుడు ప్రభాస్ చేస్తున్న ఫౌజీ లాంటి సినిమాలున్నాయి. మరి, పూరి ప్లాన్స్ ఇప్పుడెలా మార్చుకుంటాడో.


