ఏపీ

Ap : గ్రూప్-1 స్కాంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు బిగుస్తున్న ఉచ్చు?

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలవ్వగా..2019 మే 26న ప్రిలిమ్స్‌, 2020 డిసెంబరులో మెయిన్స్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం జరగాలి, కానీ కోవిడ్‌ ఉందన్న కారణంతో డిజిటల్‌ మూల్యాంకనం చేశారు.అక్కడే పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదలవ్వగా..2019 మే 26న ప్రిలిమ్స్‌, 2020 డిసెంబరులో మెయిన్స్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనల ప్రకారం మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాల మూల్యాంకనం జరగాలి, కానీ కోవిడ్‌ ఉందన్న కారణంతో డిజిటల్‌ మూల్యాంకనం చేశారు.అక్కడే పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే,గ్రూప్-1 ఫలితాలు విడుదలైన మూడు నెలల్లోనే తమకు అన్యాయం జరిగిందని, మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్ గానే చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది.నాడు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు నిబంధనలు తుంగలో తొక్కి.. ఏపీపీఎస్సీ కార్యాలయం లేదా ప్రభుత్వ భవనాల్లో జరగాల్సిన మూల్యాంకనాన్ని గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌కు తరలించారు. 84 రోజుల పాటు జవాబుపత్రాలు అక్కడే ఉంచి వారికి నచ్చిన వారితో మార్కులు వేయించినట్టు తెలిసింది.

దీంతో మరల గ్రూప్-1 వివాదంపై అభ్యర్థులు రోడ్డెక్కడంతో పాటు కోర్టును ఆశ్రయించారు. చేసేదేమీ లేక నాటి వైసీపీ ప్రభుత్వం.. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌తో బలవంతంగా వీఆర్ఎస్ ఇప్పించి మరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు స్థానంలో ఎపీపీఎస్సీ చైర్మన్‌గా నాటి సీఎం జగన్ నియమించారు.రిసార్టులో జరిగిన మూల్యాంకనంపై కోర్టు సీరియస్ అవ్వడంతో కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ సవాంగ్ మరల విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయంలో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించారు. అయితే, మాన్యువల్ మూల్యాంకనం, డిజిటల్ ఫలితాలకు ఏకంగా 62% వ్యత్యాసం వచ్చింది. దీంతో వందలాది పేపర్లలో దిద్దుబాట్లు జరిగినట్టు అభ్యర్థులు ఆరోపించారు. దీని వెనుక సవాంగ్ కుట్ర పన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

https://x.com/Telugu360/status/2088085885397192948?s=20

ప్రస్తుతం ఏపీలో అధికార మార్పిడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. కోర్టు ఆదేశాలతో ఈ వివాదంపై విచారణ చేపట్టేందుకు ‘సిట్’ను ఏర్పాటు చేయగా.. అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కమిషన్ ఆమోదం లేకుండా దొంగ మూల్యాంకనాలు పూర్తి చేసి, రికార్డులు మాయం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు.దీనివెనుక మాజీ డీజీపీ, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మారగానే జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన వెళ్లిపోయిన సవాంగ్ వైపే ఫోరెన్సిక్ సాక్ష్యాలు, కామ్‌సైన్ ప్రతినిధుల వాంగ్మూలాలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

#group-1 scam#Andrapradesh#ex dgp goutam sawang#involvemt#SIT investigation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి