Mohan babu: సీనియర్ హీరోలలో మోహన్ బాబు, డాక్టర్ రాజశేఖర్ మాత్రమే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వెనకబడ్డారు. వీరు హీరోగా చేస్తే చూసే ఛాన్సే లేదు. క్యారెక్టర్స్ పడాలంటే కథలో దమ్మున్న పాత్ర దక్కాలి. కానీ, ఇవి రెండు ఈ ఇద్దరు సీనియర్ హీరోల విషయంలో జరగడం లేదు. అందుకే, అరకొరక పాత్రల్లో కనిపించినా అవి ఏమాత్రం గుర్తింపు తేలేకపోతున్నాయి.
మోహన్ బాబు ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఒకరకంగా హీరోను ఢీకొనే పాత్ర అని ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే అర్థమైంది. గత కొంతకాలంగా సరైన క్యారెక్టర్ పడక పెద్దగా కనిపించని మోహన్ బాబు ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాననే నమ్మకంతో ఉన్నాడట. నానికి ధీటైన పాత్ర ‘ది ప్యారడైజ్’ మూవీలో పోషించినట్టుగా తెలుస్తోంది.
దసరా సినిమాతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. నానీ కెరీర్‌లో కూడా దసరా సినిమా ఓ ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుంది. ఇప్పుడు, వీరిద్దరు కలిసి మళ్ళీ ది ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నారు. హీరోయిన్‌గా కయాదు లోహర్‌కి మంచి క్రేజ్ వస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కీర్తికి కూడా ఇందులో చేస్తున్న స్పెషల్ సాంగ్ చాలా మంచి పేరును తెచ్చిపెడుతుందట.
‘ది ప్యారడైజ్’ ఎందుకింత ప్రత్యేకం:
ప్రతీ హీరోకి లైఫ్ లో ఓ ఛాలెంజింగ్ రోల్ చేసే ఛాన్స్ చాలా తక్కువ సినిమాలకి వస్తుంది. నానికి అలా వచ్చిన వాటిలో ఈ ‘ది ప్యారడైజ్’ మూవీ ఒకటి. ఈ సినిమాలో రెండు పొడవాటి జడలతో కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఎప్పటికీ అందరూ గుర్తుంచుకునే పాత్ర నానిది. ఇక, ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది. మొత్తం 8 భాషల్లో నాని సినిమా రిలీజ్ అవుతుంది ఈ ‘ది ప్యారడైజ్’ మూవీ మాత్రమే. ఇక, ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేబోతున్నారు.


