Aadarsha Kutumbam: టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు..గత కొంతకాలంగా హిట్స్ లేక నిర్మాతగా నష్టాల్లో ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఈ మధ్య రాజు గారి జోరు తగ్గింది. మన తెలుగు ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ ఎవరూ కూడా దిల్ రాజుకి డేట్స్ ఇవ్వడం లేదని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరూ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదట.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుసగా గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకోవడానికి మన రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నారట.
అయితే, ఈ మధ్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీకి, దిల్ రాజుకి ఎక్కడో డిఫరెన్సెస్ వచ్చి, వీరి సినిమాల డిస్ట్రిబ్యూషన్ రాజు గారికి ఇవ్వడం లేదు. అయితే, అన్నపూర్ణ సంస్థకి.. లేదంటే ఇతర డిస్ట్రిబ్యూషన్స్ కి ఇస్తున్నాడు. వాస్తవానికి, నాగవంశీకి అన్ని రకాలుగా ఇన్స్పిరేషన్ దిల్ రాజు అని పలు సందర్భాలలో చెప్పాడు. కానీ, ఈ మధ్య ఆ బాండింగ్ కాస్త బ్రేకైంది.
ఇలాంటి, పరిస్థితుల్లో ‘ఆదర్శ కుటుంబం’ నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజుకి ఇస్తారా అనేది ఇప్పుడు, ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు మాత్రం ఒకవైపు త్రివిక్రమ్ తో, మరోవైపు నిర్మాత ఎస్.రాధాకృష్ణ తో చర్చలు జరుపుతూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడట. చూడాలి, మరి వీరు దిల్ రాజుకి ‘ఆదర్శ కుటుంబం’ నైజాం హక్కులను ఇస్తారో లేదో.


