టాప్ న్యూస్

NALSAR : నల్సార్ విద్యార్థులపై బీసీఐ బ్యాన్.. అంతలోనే విత్ డ్రా.. అసలేమైంది?

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదారాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ లా కాలేజీపై తీవ్ర వివాదం చెలరేగింది. జెన్ జీని బొద్దింకలతో పోల్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకోబోమని నల్సార్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొందరు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.

హైదారాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ లా కాలేజీపై తీవ్ర వివాదం చెలరేగింది. జెన్ జీని బొద్దింకలతో పోల్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా తాము డిగ్రీలు తీసుకోబోమని నల్సార్ లా కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కొందరు నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది.

NALSAR న్యాయ కళాశాల విద్యార్థుల నమోదున బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు క్యాంపెయిన్ చేశారని, 2026 బ్యాచ్ విద్యార్థుల నమోదు ప్రక్రియపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. మళ్లీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. కొందరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించడం సరికాదని భావించి, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు BCI డైరెక్టర్ మనన్ కుమార్ మిశ్రా ప్రకటించారు.

ప్రస్తుతానికి విద్యార్థులంతా తమకు నచ్చిన రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటన చేసింది. అయితే,జస్టిస్ సూర్యకాంత్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిన విద్యార్థులు, వారిని రెచ్చగొట్టిన పలువురు ఉపాధ్యాయుల జాబితాతో ఒక రిపోర్ట్ ఇవ్వాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని BCI ఆదేశించగా..నల్సార్ లా యూనివర్సిటీ దానికి కౌంటర్ ఇచ్చింది.

విద్యార్థులపై ఎంక్వైరీ చేయాలా వద్దా? అనేది తమ నిర్ణయం అని తెలిపింది. తమ యూనివర్సిటీ నిబంధనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని BCIకి వర్సిటీ యాజమాన్యం సమాధానం ఇచ్చింది.కాగా, పనిలేనివారు,నిరుద్యోగులే ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి ఆందోళనలు చేస్తారని, వారి బొద్దింకలతో పోలుస్తూ చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారడం, సీజేఐ పార్టీ పుట్టుకురావడం,దేశంలో పెను సంచలనాలకు కారణమైన విషయం తెలిసిందే.

https://x.com/TeluguScribe/status/2088112783644655843?s=20

#NALSAR law univercity#hyderabad#BCI#BAN students#Withdraw#CJI suryakanth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి