సినిమా

Megastar-Super Star: దసరా, సంక్రాతి బరిలో మెగాస్టార్-సూపర్ స్టార్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Megastar-Super Star: ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మన సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా వంటి సీజన్స్ చాలా ప్రధానమైనవి. కాబట్టే, పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు పోటీ పడుతుంటాయి. 2027, సంక్రాంతికి కూడా ఈసారి గట్టి పోటీ నెలకొనబోతోంది.

Megastar-Super Star: ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మన సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్, దసరా వంటి సీజన్స్ చాలా ప్రధానమైనవి. కాబట్టే, పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు పోటీ పడుతుంటాయి. 2027, సంక్రాంతికి కూడా ఈసారి గట్టి పోటీ నెలకొనబోతోంది.

దసరా బరిలో మెగాస్టార్-సూపర్ స్టార్:

ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా, అక్టోబర్ 15వ తేదీన సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విశ్వంభర చిత్రాన్ని అక్టోబర్ 16న రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇదే, నిజమైతే బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్ ఉండబోతోంది.

2027 సంక్రాంతికి కూడా చిరు వర్సెస్ రజినీ?

ఇక, 2027 సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నట్టుగా తెలుస్తోంది. కమల్ హాసన్ నిర్మాణంలో రజినీ ధర్మన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకు రాబోతున్నారట. ఇక, వాల్తేరు వీరయ్య లాంటి మాస్ కమర్షియల్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న మెగా 158 కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల, చిరు ఈ సినిమా టైటిల్ 'కదిరి' అన్నట్టుగా హింట్ ఇచ్చాడు.

అనిల్ రావిపూడి మల్టీస్టారర్ కూడా సంక్రాంతికే..

వరుసగా 9 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. అనిల్ కి బాగా కలిసొచ్చిన సంక్రాంతికే, ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట. మొత్తానికి, సౌత్ స్టార్ హీరోలు ఈసారి 2027 సంక్రాంతికి గట్టిగానే పోటీ పడబోతున్నట్టు అర్థమవుతోంది.

#megastarchiranjeevi#superstarrajinikanth#dharman#kadiri
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి