క్రైమ్

TG : వీడిన నల్గొండ జంట హత్యల కేసు మిస్టరీ.. మర్డర్స్ వెనుక కన్నింగ్ ‘ఖాకీ’..!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండంలో జంటహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈ హత్యా ఉదంతం వెలుగుచూడగా.. సూర్యాపేట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా మోతె మండంలో జంటహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈ హత్యా ఉదంతం వెలుగుచూడగా.. సూర్యాపేట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. జంటహత్యల కేసు వెనుక ఉన్నది ఓ కానిస్టేబుల్ అని తేల్చారు. వివాహేతర సంబంధం, డబ్బుల విషయంలో గొడవనే హత్యకు దారితీసిందని సమాచారం.

బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు(50), భూబా(40) దంపతులు రెండేండ్ల కిందట పొట్టకూటి కోసం మోతె మండల కేంద్రానికి వలసొచ్చారు. బొక్క అమృత రెడ్డికి చెందిన కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. మంగళవారం అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగుల దాడిలో దంపతుల మరణించారు.

ఆధారాలు లభించకుండా మృతదేహాలను ప్లై ఓవర్‌కు సమీపంలో పూడ్చిపెట్టారు. బుధవారం ఉదయం ఓ రైతు పొలం వద్దకు వెళ్తుండగా దారిలో రక్తం మరకలు కనిపించాయి. వెంటనే స్థానిక పీఎస్‌కు సమాచారం ఇవ్వగా ఎస్‌ఐ లచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు.అనంతరం ఈ కేసును మునగాల సీఐ టేకప్ చేసినట్టు తెలిసింది. విచారణలో భాగంగా వివాహేతర సంబంధమే దంపతుల హత్యకు కారణమని తేలింది.

మృతుడు నాగులు భార్య రామావత్ బూబాతో కానిస్టేబుల్ షరీఫ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే, బూబా కూతురి పెళ్లికోసం షరీఫ్ రూ.3 లక్షలు అప్పుకింద ఇచ్చినట్టు సమాచారం. తిరిగి డబ్బులు ఇవ్వాలని అడుగగా తాను ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకోవాలని.. గట్టిగా బెదిరిస్తే వివాహేతర సంబంధం మ్యాటర్ బయటపెడతానని బూబా షరీఫ్‌ను బెదిరించినట్టు తెలిసింది.

దీంతో ప్లాన్ ప్రకారమే షరీఫ్..పట్టుబడిన గంజాయి పాతిపెట్టేందుకు మట్టి గుంతలు తీయాలని నాగులు, బూబాను పొలానికి తీసుకెళ్లి మరో ఇద్దరి సాయంతో దాడి చేసి హత్య చేసి అనంతరం అక్కడే పాతిపెట్టి వచ్చినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి నిందితుడు షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

https://x.com/TeluguScribe/status/2088119015659143659?s=20

#double murder#suryapet#telanganaa#constable#accused#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి