Sharwanand: టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న శర్వానంద్ బైకర్ మూవీతో వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. కానీ, ఆశించినంత భారీ కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో, ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న భోగి సినిమాపైన చాలా నమ్మకాలున్నాయి. గత కొంతకాలంగా దర్శకుడిగా సంపత్ నంది సరైన హిట్ లేక ఎదురుచూస్తున్నాడు.
శర్వానంద్ కూడా చాలా కాలం అయింది హిట్ అందుకొని. అందుకే, ఇప్పుడు వీరిద్దరికీ సాలీడ్ హిట్ చాలా అవసరం. అయితే, వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టు 28వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కట్ చేస్తే కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ పోటీకి వచ్చింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది.
కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమ ఖురేషి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా టాక్సిక్ రిలీజ్ కాబోతోంది. దీంతో, శర్వానంద్ భోగి సినిమాకి సోలో డేట్ మిస్ అయింది. ఇప్పుడు, ఇంకో డేట్ చూద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కానీ, డిసెంబర్ వరకూ మంచి డేట్ గానీ, మంచి సీజన్ గానీ కనిపించడం లేదట. అవకాశం ఉంటే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తారని తెలుస్తోంది. లేదంటే 2027 సంక్రాంతి బరిలోనే దిగాలి. శర్వా ఇలా సంక్రాంతి సీజన్ లో వచ్చి శతమానంభవతి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కాబట్టి, సంక్రాంతి కూడా శర్వాకి కలిసొచ్చే పండుగే. చూడాలి, మరి సంపత్ నంది ఎలా ప్లాన్ చేస్తాడో.












