అనుమానం పెనుభూతంలా మారుతోంది. తన భర్త, భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే అనుమానంతో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. భర్యను చంపడం లేదా ఆత్మహత్య చేసుకోవడం, కొన్ని సందర్భాల్లో ఈ రెండు జరుగుతున్నాయి.ఇక కొందరు మహిళలైతే ఏకంగా ప్రియుడితో కలిసి భర్తలను లేపేస్తున్నారు. అనంతరం పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అయితే, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో ఓ వ్యక్తి జీవిత భాగస్వామిని హత్యచేసి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పూర్తి వివరాల్లోకివెళితే.. కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు తాలూకా కేసగోడు గ్రామానికి చెందిన రఘుకు 12 ఏండ్ల కిందట గగనతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే, కొన్నాళ్ల నుంచి రఘు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు.మరొకరితో ఎఫైర్ పెట్టుకుందన్న డౌట్‌తో గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలోనే మరోసారి గొడవ జరగ్గా గొంతు నులిమి భార్యను చంపి ఆమె శవం కనిపించకుండా ఎక్కడో పడేశాడు.
https://x.com/pulsenewsbreak/status/2083801470630314054?s=20
ఆపై ఊరి చివరన ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కి ముందు తన భార్యను చంపానని వీడియో కాల్ చేసి బంధువులకు సమాచారం అందించాడు రఘు. విషయం తెలియడంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.












