వైరల్ న్యూస్

Ap : బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో యువతి రీల్స్.. షాకిచ్చిన భక్తులు!

రచన: Kumar4 నిమిషాల పఠనం

నేటితరం యువతులు రీల్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. రీల్స్ చేశామా? సోషల్ మీడియాలో పోస్టు చేశామా? వ్యూస్, కామెంట్స్ చూస్తూ మురిసిపోయామా? అన్నట్టు వీరి లైఫ్ స్టైల్ కొనసాగుతోంది.ఫాలోవర్స్ పెరిగితే జీవితంలో ఏదో సాధించినట్టు కొందరు భావిస్తున్నట్టు నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్నది

నేటితరం యువతులు రీల్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. రీల్స్ చేశామా? సోషల్ మీడియాలో పోస్టు చేశామా? వ్యూస్, కామెంట్స్ చూస్తూ మురిసిపోయామా? అన్నట్టు వీరి లైఫ్ స్టైల్ కొనసాగుతోంది.ఫాలోవర్స్ పెరిగితే జీవితంలో ఏదో సాధించినట్టు కొందరు భావిస్తున్నట్టు నెట్టింట జోరుగా చర్చ జరుగుతున్నది. కాలేజీ, స్కూల్, ఇళ్లు, బయటి ప్రాంతాలు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు ఇలా వేటిని వదలడం లేదు. రీల్స్ చేశామా? ర్యాండమ్ పిక్స్ క్లిక్ చేసి సోషల్ మీడియాలో పెట్టామా? ఇదే వీరి డైలీ రొటీన్‌‌గా మారిపోయింది.

అయితే, పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ చేస్తే ఎదుటివారు ఇబ్బందులు పడుతారనే మినిమమ్ కామన్ సెన్స్ కూడా కొందరికి లేకుండా పోతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజ‌య‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ఓ యువ‌తి రీల్స్ చేయ‌డం తీర్చ చర్చకు దారితీసింది. ప్రధాన ఆలయ ప్రాంగణంలో ద యువ‌తి రీల్స్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. రాజగోపురం ఎదుటే ఓ పాట‌కు య‌వతి డ్యాన్స్ చేస్తున్న‌ట్టు వీడియోలో క‌నిపిస్తోంది.

ఫోటో అయితే కొన్ని సెక‌న్ల‌లో ముగుస్తుంది. డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారంటే చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది.ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడకు పోయారు? అస‌లు ఏం చేస్తున్నారు? ఇలా ఆలయ ప్రతిష్టను కొందరు దెబ్బతీస్తుంటే ఎందుకు ఉపేక్షిస్తున్నారని మండిపడుతున్నారు.వీడియాలు తీయడానికి, రీల్స్ చేయడానికి అనుమతులు ఎలా ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆల‌యంలోకి మొబైల్స్, కెమెరాలు నిషేధం కదా? ఎలా క్యారీ చేశారని నిలదీస్తున్నారు. కాగా, ఈ ఘటనపై భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు.ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రతిష్టను, టెంపుల్ నియమనిష్టలను దెబ్బతీసేలా చేస్తున్నవారిపట్ల ఉపేక్షించొద్దని కఠినంగా వ్యహరించాలని సోషల్ మీడియా వేదికగా ఆ యువతి మీద ఫిర్యాదు చేస్తున్నారు.

#vijayawada#durgamma temple#Reel#girl#viral video#andrapradesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి