క్రైమ్

Crime : ఈ దొంగలకు ఆకలెక్కువ..ఆమ్లెట్లు వేసుకుని తిని భారీ దోపిడీ!

రచన: Kumar3 నిమిషాల పఠనం

దొంగతనానికి వెళ్లిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా దోచుకుని భయడపడుతుంటారు.కానీ, ఇటీవవి కాలంలో కొందరు దొంగలు వింతైన పనులు చేస్తున్నారు. ఇంటికి వెళ్లి మంచిగా తినేసి పడుకోవడం, టీవీ చూడటం, మందు తాగడం వంటివి చేస్తున్నారు.

దొంగతనానికి వెళ్లిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా దోచుకుని భయడపడుతుంటారు.కానీ, ఇటీవవి కాలంలో కొందరు దొంగలు వింతైన పనులు చేస్తున్నారు. ఇంటికి వెళ్లి మంచిగా తినేసి పడుకోవడం, టీవీ చూడటం, మందు తాగడం వంటివి చేస్తున్నారు. అనంతరం పోలీసులకు దొరక్కుండా జంప్ అయిపోతున్నారు. దొంగలు చేసిన పనులు చూసి షాక్ అవ్వడం అటు పోలీసులు, ఇటు బాధిత కుటుంబీకుల వంతవుతోంది.

తాజాగా కొందరు దొంగలు ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లి కిచెన్‌లో ఆమ్లెట్లు వేసుకుని తిన్నారు. అనంతరం దొరికినకాడికి దోచుకుని ఎస్కేప్ అయ్యారు.ఉదయాన్నే లేవగానే ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి స్థానికులు ఇంటి యాజమానికి సమాచారం అందించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఝలావడ్‌ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకివెళితే.. దొంగతానికి గురైన ఇంటి యజమాని హర్‌జీత్ సింగ్.. క్యాన్సర్ చికిత్స కోసం ఫ్యామిలీతో కలిసి ముంబైకి వెళ్లారు.ఎవరూ లేరనే విషయం తెలుసుకుని ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు డజనుకు పైగా గుడ్లతో ఆమ్లెట్లు వేసుకొని తిన్నట్టు సమాచారం.

https://x.com/pulsenewsbreak/status/2083722449384828947?s=20

ఆపై ఇంట్లోని నగలు, నగదుతో పాటు ఓ ఖరీదైన టీవీని దొంగలించి పారిపోయారని తెలిసింది.ఉదయం తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి అటు యాజమాని, ఇటు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

#theifs#omlets#eating#rajastan#house robbery#crime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి