తెలంగాణ

TG : మరో ఫుడ్ పాయిజన్.. బెడ్స్ మీద అచేతన స్థితిలో విద్యార్థులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అందుకే తన విద్యాశాఖను ఉంచుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, జీతాలు పెంపు, హెల్త్ స్కీమ్, మోడల్ స్కూల్స్ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అందుకే తన విద్యాశాఖను ఉంచుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, జీతాలు పెంపు, హెల్త్ స్కీమ్, మోడల్ స్కూల్స్ అన్నింటినీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యావ్యవస్థలో సమూళ మార్పులు చేస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సైతం కొత్తగా నిర్మిస్తున్నామని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం విద్యావ్యవస్థలో చాలా లొసుగులు, సమస్యలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ ఏడాది జూన్‌లో అకడమిక్ ఇయర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఐదుకు మించి ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూశాయి. ఒకటి రెండు అంటే కామన్. కానీ, ఒకదాని తర్వాత మరొకటి వెలుగుచూస్తుండటంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎలా బ్రష్టుపట్టి పోయిందో అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ప్రయివేట్ స్కూల్స్‌కు పంపిద్దాం అనుకుంటే ఫీజుల దోపిడీని తట్టుకోలేక నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు పంపిస్తున్నారు.

తీరా అక్కడ సౌకర్యాలు లేక నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో తాగు, తమ అవసరాల కోసం నీరు లేక విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపిన ఘటనలు చాలానే ఉన్నాయి.ఇక ఫుడ్ పాయిజన్ ఘటనలు మాత్రం అస్సలు ఆగడం లేదు.తాజాగా మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లలేదని లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే తామే స్వయంగా పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పేరెంట్స్ తెలిపారు.

https://x.com/TeluguScribe/status/2083753435527352446?s=20

#gurukula schools#food poison#bellampally#students sick
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి