క్రైమ్

Crime : సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపులు.. విద్యార్థిని సూసైడ్!

రచన: Kumar4 నిమిషాల పఠనం

సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ అధికారితో పాటు మరో వ్యక్తి కూడా బాధితురాలిని వేధించినట్టు సమాచారం.

సింగరేణిలో సూపర్‌వైజర్ లైంగిక వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ అధికారితో పాటు మరో వ్యక్తి కూడా బాధితురాలిని వేధించినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసిన యువతి (21). ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజినీరింగ్ సీటు సాధించింది.అనంతరం ఇంటర్న్‌షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో జాయిన్ అయ్యింది.

ఈ క్రమంలోనే బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్‌మ్యాన్ (సూపర్‌వైజర్) ఆమెకు పరిచయం అయ్యాడు. తాను కూడా సేమ్ కాలేజీలో డిప్లొమా చేశానని నమ్మించి దగ్గరయ్యాడు. అనంతరం యువతిపై రవికుమార్ లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. బాధితురాలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇంటర్న్‌షిప్ మానేసి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో పనికి చేరినట్టు తెలిసింది.

అయినప్పటికీ సింగరేణి సూపర్ వైజర్ రవికుమార్‌తో పాటు పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకుడు నవీన్ ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది.ఆ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 14న విద్యార్థిని మృతిచెందింది. తన కూతురి మరణానికి కారణమైన నవీన్, రవికుమార్‌పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విషయం తెలియడంతో నిందితులు ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా,ఆత్మహత్యకు ముందు యువతి సూసైడ్ నోట్ రాసినట్టు సమాచారం. అందులో తన మరణానికి గల కారణాలను పేర్కొన్నట్టు యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన సింగరేణి అధికారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆఫీస్ రహదారిపై మృతదేహంతో బైఠాయించి ధర్నా చేపట్టారు.

https://x.com/TeluguScribe/status/2100079344085590318?s=20

#21 years old#girl#suicide#sexual harrasment#peddapalli#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి