M.M.Keeravani: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా విషయంలో ఎంత ఖచ్చితంగా, పట్టుదలగా ఉంటారో చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనతో వర్క్ చేస్తున్న టెక్నికల్ టీమ్ కి, నటీనటులకి మాత్రం గ్యారెంటీగా తెలుస్తుంది. కథ విషయంలో ఏమాత్రం మొహమాటపడకుండా తండ్రి విజయేంద్ర ప్రసాద్‌నే "నాన్నగారు నాకు ఈ సీన్ ఇలానే కావాలి" అని నిర్మొహమాటంగా చెప్పేరకం.
ప్రతీ షాట్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. లైటింగ్ విషయంలోనూ అంతే. రీడింగ్ సరిగ్గా చెప్పకపోయినా ఆ షాట్ మళ్ళీ తీసిన సందర్భాలెన్నో ఉన్నాయి. అలాగే, మ్యూజిక్ విషయంలోనూ. జక్కన్నకి ఏది కావాలో ఎలా కావాలో అలా మ్యూజిక్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ ఇవ్వగలిగే ఏకైక వ్యక్తి ఎమ్.ఎమ్.కీరవాణి. ఆయన, ఇటీవల చెప్పినట్టుగానే వారణాసి సినిమాకి మ్యూజిక్ వర్క్‌ను స్టార్ట్ చేశాడు.
రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పాడు కీరవాణి. అలాగే, ఈ నెల నుంచే వారణాసి చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేస్తానని అన్న మాట ప్రకారం ఆ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా ఎమ్.ఎమ్.కీరవాణి తన బృందం కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం, ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఏదేమైనా, 2027..ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా వారణాసి రిలీజ్ ఖాయమని రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే అర్థమవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో వారణాసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే చిత్రంగా రూపొందుతోంది. గ్లోబల్ వైడ్‌గా బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ప్రియాంక చోప్రా. అదుకే, జక్కన్న హీరోయిన్‌గా ఆమెని ఎంచుకున్నాడు. ఇక, పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ రాజమౌళి రిలీజ్ చేసిన పాత్రలు ఈ మూడే. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు.












