సినిమా

Balakrishna: 'దాదా'లో ఆ రెండు సినిమాల సెంటిమెంట్!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దాదా. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్దాయి. అదీకాక, ఇంతకముందు బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. ఆ ప్రభావం కూడా 'దాదా'పై ఉంది. ఇక, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో సమరసింహారెడ్డి చిత్రానికి ముందు...ఆ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. అంతటి ప్రభావం ఈ సినిమాతో బాలయ్యకి వచ్చింది. ఫ్యాక్షన్ సినిమా అంటే బాలకృష్ణ అని ఇండస్ట్రీలో చెప్పుకునేలా ఆయన గ్రాఫ్ పెరిగింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా బాలయ్య చేసే యాక్షన్ సీన్స్..తొడకొడితే ఉరుములు..చిటికెస్తే ట్రైన్ రావడం..అందరివల్లా కాదని ఓపెన్‌గా చెప్పారు. అంతటి మాస్ ఇమేజ్‌ను బాలయ్య సొంతం చేసుకున్నాడు.

అయితే, దాదా సినిమాలో గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ మాత్రమే కాకుండా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయట. గోపీచంద్ మలినేని సినిమాలు చూస్తుంటే ఫక్తు కమర్షియల్ సినిమా అయినప్పటికీ..రవితేజ లాంటి మాసివ్ హీరోకి కూడా అద్భుతమైన కుటుంబ నేపథ్యాన్ని రాసుకున్నాడు. అలా, వీరి కాంబోలో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

బాలయ్య అంటే పవర్ ఫుల్ డైలాగ్స్..భారీ యాక్షన్స్ సీక్వెన్సెస్..కంటతడి పెట్టించే కుటుంబ నేపథ్యంగా సాగే ఎమోషనల్ సీన్స్ తప్పనిసరి. అందుకే, దర్శకులు ఆయనకి కథ రాసేముందు ఈ అంశాలన్నీ పకడ్బందీగా ఉండేలా చూసుకుంటారు. అలాగే, గోపీచంద్ మలినేని కూడా మంచి ఫ్యామిలీ సీక్వెన్సెస్ దాదా కోసం రాశాడట. ఇక, ఈ సినిమాను ఇదే..ఏడాది డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

#NBK#NBK111#Dada#Balakrishna#Gopichand Malineni
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి