Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నేరుగా ఇప్పటి వరకూ బాలీవుడ్ డైరెక్టర్‌తో పనిచేసిన దాఖలాలు లేవు. దీనికి కారణం ఆయనే స్వయంగా నాకు హిందీ రాదని ఒప్పుకోవడంతో పాటు బాలీవుడ్‌లో స్ట్రైట్ సినిమా చేయడానికి కూడా హిందీ భాషే సమస్య అని చెప్పాడు. అయితే, తాజా సమాచారం మేరకు బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో నెక్ట్ సినిమా చేస్తాడనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకూ తెలుగులో సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎజ్.జె.సూర్య దర్శకత్వంలో నాని చేశాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పెద్దగా తమిళ దర్శకులతోనూ ఆయన సినిమాలు చేయలేదు. ప్రస్తుతం, దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ కెరీర్లో చేస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా. ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ సినిమా.
మహేష్ ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా రెండు అధ్బుతమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. మందాకినిగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమాపై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే 350 కోట్లకి పైగా రాజమౌళి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల అన్నీ భాషల ఓటీటీ డీల్ కూడా జక్కన్న అనుకున్న రేంజ్‌లో రాలేదని నో చెప్పాడని వార్తలు వచ్చాయి. అంతగా నమ్మకాలున్నాయి మహేష్ వారణాసి మూవీపై.
దీంతో, వారణాసి తర్వాత సూపర్ స్టార్ ఏ దర్శకుడితో సినిమాను ప్రకటిస్తాడని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల మహేష్ బాబుకి కథ వినిపించినట్టుగా తెలుస్తోంది. ఇంతకముందు సంజయ్ లీలా భన్సాలీ టాలీవుడ్ స్టార్స్ అయిన..ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, వీరిలో ఎవరితోనూ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని తేలలేదు. ఇప్పుడు, మహేష్ బాబుతో భన్సాలీ చర్చలు జరిపినట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ, మహేష్ మాత్రం ఏ ప్రాజెక్ట్ అయినా వారణాసి రిలీజ్ తర్వాతే ప్రకటించనున్నాడని సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.









