తెలంగాణ

TG : అసైన్డ్ భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్ హరీశ్ రావు : మంత్రి పొంగులేటి

రచన: Kumar4 నిమిషాల పఠనం

అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22ఏ అంశంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధపడింది.

అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22ఏ అంశంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధపడింది. ఈ క్రమంలోనే రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా మంది సామాన్యులు, పేదల పట్టా భూములు 22ఏ నిషేధితా జాబితాలోకి ఎలా వెళ్లాయనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో కీలక ప్రసంగం చేయనున్నారు.

అయితే,సెషన్స్ ప్రారంభానికి ముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు భారీ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తన మామ భూములకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్ఓసీ ఇచ్చిందన్న మాజీ మంత్రి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. అసైన్డ్ భూములకు ఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది తప్పే అవుతుందని.. ఆ విషయం హరీశ్ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.

‘ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పు అని తెలిసినప్పుడు హరీశ్‌రావు ఎలా చేయించుకున్నారు? అప్పుడు నీ బుద్ధి ఎక్కడికి పోయింది?’ అని ప్రశ్నించారు. భూదాన్ భూమిని కారు పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నకిలీ ఎన్‌ఓసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అది కూడా తప్పేనన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో 'స్టేటస్ కో' ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.

22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కేవలం 4 లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూమి ఉందని.. మిగతాదంతా ప్రభుత్వ భూమేనని మంత్రి పొంగులేటి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 ఏ జాబితా నుంచి మరో 40 వేల ఎకరాల భూమిని తగ్గించామన్నారు.గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల చిట్టాను త్వరలోనే బయటపెడతామని అన్నారు. 22ఏ భూముల వ్యవహారంలో ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందని మంత్రి తెలిపారు.

#minister ponguleti srinivasa reddy#22A#Harishrao#BRS#congress#assembly#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి