తెలంగాణ

TG : 10 నిమిషాలు చాన్స్ ఇవ్వండి.. లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అవ్వగా వాడివేడీగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి ఇవ్వడంతో సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అవ్వగా వాడివేడీగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి ఇవ్వడంతో సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.ఎన్నికలు ముగిసి రెండున్నరేండ్లు అయినా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు కేటాయిచడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిగి, సీఎం సొంత నియోజకవర్గం కొండగల్‌కు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తన సొంత నియోజకవర్గం ఆర్మూర్‌కు నిధులు ఇవ్వడం లేదని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూరులో నిజాం కాలంలో కట్టిన ఎంఆర్వో ఆఫీస్ ఉందని, సబ్‌కలెక్టర్ ఆఫీస్‌లో మాత్రం క్లర్క్ కూర్చునే విధంగా సౌకర్యాలు ఉన్నాయన్నారు.

ఈ విషయంలో తాను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు పలుమార్లు వెళ్లానని, రెండేళ్ల నుండి ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కోసం అడుగుతున్నానని ఈ సందర్బంగా గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లా అంటే ప్రభుత్వానికి అంత చిన్నచూపు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పట్ల అనుసరిస్తున్న విధానాలు, చర్యలతో విసిగిపోయాయని, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ అసహనం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ ఎవరికి పట్టని జిల్లాగా మారిందని మండిపడ్డారు. ఒకప్పుడు నిజాంసాగర్ నీళ్లతో కలకలలాడిన జిల్లా ఇప్పుడు కరువుతో ఇబ్బంది పడుతోందన్నారు. తమకు రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రావడంలేదని, కనీసం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం మంజూరు చేయించాలని కోరారు.కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారో తన వద్ద చిట్టా ఉందని, అన్ని లెక్కలు చెప్పి రాజీనామా చేస్తానని, 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పీకర్‌ను కోరారు.ఆర్మూర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

#Armoor mla rakesh reddy#nizamabad#congress#bjp#assembly#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి