National

UPINews: బ్యాంకులకు మహర్దశ.. యూపీఐ చార్జీలతో రూ.20,000 కోట్ల లాభం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగాన్ని శాసిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త వాణిజ్య విధానానికి తెరలేపింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునరుద్ధరణ నిర్ణయంతో దాదాపు ఆరేళ్ల ఉచిత విధానానికి తెరపడనుండగా, ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల రాబడిని ఊహించని రీతిలో పెంచనుంది.

 దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగాన్ని శాసిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త వాణిజ్య విధానానికి తెరలేపింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునరుద్ధరణ నిర్ణయంతో దాదాపు ఆరేళ్ల ఉచిత విధానానికి తెరపడనుండగా, ఇది బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థల రాబడిని ఊహించని రీతిలో పెంచనుంది. ఈ నూతన సంస్కరణ ద్వారా బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రతి ఏటా రూ.20,000కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషక సంస్థలు అంచనా వేస్తున్నాయి.

 ఎన్‌పీసీఐ తాజా నిబంధనల ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ ఎండీఆర్‌ కేవలం రూ.2,000 దాటిన పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది. దీనికింద 0.4 శాతం రుసుము విధించనుండగా, గరిష్ఠ పరిమితిని రూ.300గా నిర్ణయించారు. సాధారణ పౌరులకు ఇది పూర్తిగా ఉచితం కాగా, వ్యాపారులే ఈ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ 'గోల్డ్‌మన్ శాక్స్' నివేదిక ప్రకారం.. స్థూల లావాదేవీల పరిమాణం ఆధారంగా చూస్తే ఈ నిర్ణయం ద్వారా ఏటా రూ.20,600 కోట్ల అదనపు రాబడి క్రియేట్ కానుంది.

 మరో దిగ్గజ బ్రోకరేజ్ సంస్థ 'మోర్గాన్ స్టాన్లీ' సైతం ఈ విధానాన్ని ప్రశంసిస్తూ విశ్లేషణను విడుదల చేసింది. రాబోయే 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి డిజిటల్ పేమెంట్ సంస్థల ఎబిటా (EBITDA) ఆదాయాలు ఏకంగా 38శాతం నుంచి 48శాతానికి పైగా వృద్ధి చెందుతాయని పేర్కొంది. కాగా అంతర్జాతీయ సంస్థ 'యుబిఎస్' (UBS) ప్రకారం ఏటా రూ.10,000 నుంచి రూ.15,000కోట్ల మేర ప్యూర్ ప్రాఫిట్ సమకూరే అవకాశం ఉందని, అందులో 60-70 శాతం వాటా నేరుగా జారీ చేసే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని స్పష్టం చేసింది.

 దీర్ఘకాలంలో యూపీఐ మౌలిక సదుపాయాలు, సర్వర్ కెపాసిటీ, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ భారీ ఆదాయం ఉపయోగపడనుంది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం వ్యాపార లావాదేవీలలో 95 శాతం రూ.2,000 లోపే ఉంటున్నందున సగటు చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలపై ఎటువంటి భారం పడదని ప్రభుత్వం, ఎన్‌పీసీఐ హామీ ఇచ్చాయి. బ్యాంకులకు స్థిరమైన నాన్-ఇంట్రెస్ట్ ఇన్కమ్ వనరు అందుబాటులోకి రావడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామమని విశ్లేషకులు భావిస్తున్నారు.

#Visakhapatnam#CurrencyNotes#CentralParkVizag#VizagPolice#CrimeNews#ViralNews#APNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి