ఏపీ

AP : శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ

రచన: Kumar4 నిమిషాల పఠనం

తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులకు శుభవార్త.. ఇన్నిరోజులు భక్తుల రద్దీతో కిటకిటలాడిన స్వామి వారి సన్నిధానంలో ప్రస్తుతం ఫ్రీగా దర్శనాలు జరుగుతున్నట్టు టీటీడీ పేర్కొంది.శ్రావణమాసంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టగా.. ప్రస్తుతం 4 గంటలు మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులకు శుభవార్త.. ఇన్నిరోజులు భక్తుల రద్దీతో కిటకిటలాడిన స్వామి వారి సన్నిధానంలో ప్రస్తుతం ఫ్రీగా దర్శనాలు జరుగుతున్నట్టు టీటీడీ పేర్కొంది.శ్రావణమాసంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టగా.. ప్రస్తుతం 4 గంటలు మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కూడా భక్తుల రద్దీ తగ్గిందని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వేడుకలు జరుగుతుండగా ప్రజలు తిరుమల ప్రయాణాలు పోస్టు పోన్ చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అందుకే రద్దీ తగ్గిందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారని తెలిపారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కేవలం 4 గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని టీటీడీ తెలిపింది.

రద్దీ తక్కువగా ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గడం వల్ల సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొంది. ఇదిలాఉండగా, నిన్న ఒక్కరోజే 61,361 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్టు తెలిసింది. 18,722 మంది భక్తులు కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.7 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటించింది.కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాల వితరణ సజావుగా సాగుతోందని అధికారులు వెల్లడించారు. నవరాత్రులు పూర్తయ్యాక మళ్లీ తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

#TTD#devotees#Rush decrease#tirumala#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి